Israel-US strike on Iran : యుద్ధం ఎఫెక్ట్.. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లతోపాటు.. వాటి ధరలు భారీగా పెరగనున్నాయా..?
Israel-US strike on Iran : ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఇంకొన్ని రోజులు కొనసాగితే భారతదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Israel-US strike on Iran
Israel-US strike on Iran : ఇరాన్ పై ఇజ్రాయెల్ – అమెరికా దాడులకు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సెగలు రేగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పరుగులు తీయడం ప్రారంభించాయి. ఇంకొన్ని రోజులు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగితే భారతదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత దేశం ప్రస్తుతం అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికాతో పాటు 40కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారతదేశం తన ముడి చమురు దిగుమతిని సర్దాబాటు చేసుకోవడానికి సహాయపడింది. అయితే, అమెరికా లేదంటే లాటిన్ అమెరికా నుంచి చమురు భారతదేశానికి చేరుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. గల్ప్ నుంచి కేవలం ఐదు నుంచి ఆరు రోజుల్లో ముడి చమురు భారతదేశానికి చేరుతుంది. అదే అమెరికా, లాటిన్ అమెరికా నుంచి అయితే నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది. దీనివల్ల మధ్యప్రాచ్య చమురు చౌకగా, రవాణా వేగంగా జరుగుతుంది.
మధ్యప్రాచ్యంలో సంక్షోంభం ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20 నుంచి 25శాతం వాటా కలిగిన హార్ముజ్ జల సంధి ద్వారా సరఫరాలకు ఆటంకం కలిగించవచ్చు. రష్యా చమురుపై ట్రంప్ ఆంక్షల మధ్య ఇటీవల కాలంలో హార్ముజ్ జలసంధి గుండా భారతదేశం చమురుకు ఎక్కువ మొత్తంలో రవాణా చేస్తోంది. కెప్లర్ నౌక ట్రాకింగ్ డేటా ప్రకారం.. భారతదేశం ముడి చమురు దిగుమతుల్లో రోజుకు దాదాపు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్లు జలసంధి ద్వారానే రవాణా ఉంటుంది. ఇది భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో 50శాతం. ఈ చమురులో ఎక్కువ భాగం ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి వస్తుంది. ఇరాన్ హార్మజ్ జలసంధిని మూసివేస్తే.. ప్రభావం భారతదేశంపై పడబోతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వెంటనే ముగియకుంటే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉంటుంది.
మరోవైపు.. ఇరాన్ కు భారతదేశం చేసే టీ ఎగుమతులు కూడా దెబ్బతినే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. 2024 – 2025 సంవత్సరంలో భారతదేశం దాదాపు రూ.7బిలియన్ల విలువైన టీ ఎగుమతులను ఇరాన్ కు పంపించింది. మరోవైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ప్రారంభమైనప్పటి నుంచి భారత దేశంలోని బాస్మతి బియ్యం ఎగుమతులు దాదాపు ఆగిపోయాయి.
భారతదేశం నుంచి ఇరాన్ కు ఎగుమతి చేయబడిన బాస్మతి బియ్యం రవాణా ప్రస్తుతం రవాణాలో ఉంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరానియన్ దిగుమతిదారులు ఈ బాస్మతి బియ్యాన్ని డెలివరీ చేయగలరా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఉద్రిక్తతలు కొనసాగితే.. మధ్య ఆసియా అంతటా బియ్యం ఎగుమతులపైనా ప్రభావంచూపుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం నుంచి భాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేసే దశాల్లో ఇరాన్ మొదటి స్థానంలో ఉంది. దీంతో ఆ రంగానికి చెందిన వారిలో ఆందోళన నెలకొంది.
