యూపీ హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య .. పరారీలో భోలే బాబా

హాథ్రస్ జిల్లా పూల్ రయీ గ్రామంలో బోలె బాబా ఆధ్యాత్మిక కార్యక్రమంకు 80వేల మందికి మాత్రమే నిర్వాహాకులు అనుమతి తీసుకున్నారు.

UP Hathras Stampede death Updates : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ జిల్లా ఫుల్ రయీ గ్రామంలో మంగళవారం పెనువిషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భోలే బాబా పాద దూళి కోసం భక్తులు ఒక్కసారిగా ఎగడబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. బుధవారం ఉదయం వరకు ఈ ఘటనలో 121 మంది మృతిచెందగా.. 28 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : హత్రాస్ ఘోర విషాదం.. ఎవరీ బోలే బాబా? ఏం చేస్తాడు? ఎలా పాపులర్ అయ్యాడు?

హాథ్రస్ జిల్లా పూల్ రయీ గ్రామంలో బోలె బాబా ఆధ్యాత్మిక కార్యక్రమంకు 80వేల మందికి మాత్రమే నిర్వాహాకులు అనుమతి తీసుకున్నారు. కానీ, రెండు లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు పోలీసులు తెలిపారు. తాజా ఘటనపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నరయణ సాకర్ హరి అలియాస్ బోలె బాబా కోసం వెతుకులాడుతున్నారు. ఘటన అనంతరం బాబా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : తీవ్ర విషాదం.. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116 మంది మృతి

ప్రమాద ఘటన స్థలిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ పరిశీలించనున్నారు. ఘటనపై సీఎం యోగి ఆధిత్యనాథ్ తో ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. ఘటనపై నివేదిక సమర్పించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి దీపక్ కుమార్ ను సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశించారు. మరోవైపు హత్రాస్ తొక్కిసలాట ప్రమాదంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ న్యాయవాది గౌరవ్ ద్వివేది అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు