తీవ్ర విషాదం.. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116 మంది మృతి

తొక్కిసలాటలో చిక్కుకున్న వారి అరుపులు, ఆర్తనాదాలతో అక్కడ విషాదకర దృశ్యాలు కనపడ్డాయి.

తీవ్ర విషాదం.. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116 మంది మృతి

Hatharas Stampede: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట చోటుచేసుకుని 166 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాటలో చిక్కుకున్న వారి అరుపులు, ఆర్తనాదాలతో అక్కడ విషాదకర దృశ్యాలు కనపడ్డాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య గురించి వివరాలను అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్ అగర్వాల్ జాతీయ మీడియాకు తెలిపారు.

రతీభాన్‌పూర్‌లో మహా శివుడికి సంబంధించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. అది ముగియగానే తొక్కిసలాట జరిగింది. ఇందులో మహిళలు, పిల్లలు సహా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన మహిళలు, పిల్లలను పోలీసులు, సహాయక సిబ్బంది ఎటా మెడికల్ కాలేజీకి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
తొక్కిసలాటపై సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి ఆసుపత్రిలో సరైన చికిత్స అందేలా చూడాలని అధికారులకు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మోదీ, రాహుల్ సంతాపం
తొక్కిసలాటలో 80 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో పలువురు నేతలు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొక్కిసలాటలో భక్తులు మరణించిన వార్తను విని చాలా బాధపడ్డానని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు.

మృతుల కుటుంబాలకు ఇరువురు నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. గాయపడిన వారికి అన్ని విధాలా చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండియా కూటమి కార్యకర్తలు తమ సహాయ సహకారాన్ని అందించాలని సూచించారు.

Also Read: పెన్షన్ డబ్బు రూ. 2 లక్షలతో ఇద్దరు సెక్రటరీలు అదృశ్యం, తన సొంత డబ్బు ఇచ్చిన మంత్రి