Viral Video : బైకు స్టంట్లతో దడపుట్టిస్తున్న పోకిరీలు.. ప్రాణాలతో చెలగాటాలా? పోలీసుల రియాక్షన్ ఇదిగో!

Viral Video : చేతిలో బైకు ఉంటే చాలు.. రయ్.. రయ్ మంటూ రోడ్లపై వేగంగా దూసుకుపోతున్నారు. ఏ కొంచెం పట్టుతప్పినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని మర్చిపోతున్నారు.

Viral Video : పోకిరీలు రోడ్లపై రెచ్చిపోతున్నారు. ప్రమాదకరమని తెలిసి కూడా బైకు స్టంట్లతో ప్రాణాల మీదుకి తెచ్చుకుంటున్నారు. తమ ప్రాణాలతో పాటు అటుగా వెళ్లే ఇతరుల ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం ఎక్కడో అక్కడ నిత్యం వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం అదో ట్రెండ్ అయిపోయింది.

Read Also : Wild Bison : 150 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న ప్రత్యక్షం

చేతిలో బైకు ఉంటే చాలు.. రయ్.. రయ్ మంటూ రోడ్లపై వేగంగా దూసుకుపోతున్నారు. ఏ కొంచెం పట్టుతప్పినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని మర్చిపోతున్నారు. ఇలాంటి చేష్టలతో వారికి మాత్రమే కాదు.. ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్లు, ప్రజలకు కూడా ప్రాణాంతకమే.. సరదా కోసం చేసే ఈ బైకు స్టంట్లతో ప్రాణాలు ముప్పుని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా వినడం లేదు.

ఇప్పటికీ కుర్రాళ్లు ఈ బైకు స్టంట్లను విచ్చలవిడిగా చేస్తూనే ఉన్నారు. తాజాగా తాజాగా, బీహార్‌లోని వైశాలిలో యువకులు బైక్‌లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. జిగ్-జాగ్ పద్ధతిలో బైక్‌లను నడుపుతున్న కుర్రాళ్లు ఇతర వాహనాలకు దగ్గరగా వెళ్లుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ నిర్లక్ష్యపు చర్యలతో వారి ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా రోడ్డుపై వెళ్లే వారికి కూడా తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుంది.

వీడియోపై స్పందించిన బిహార్ పోలీసులు :
”ఈ కుర్రాళ్లు తమ ప్రాణాలను పట్టించుకోకుండా రోడ్డుపై నడిచే ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి” అని గేమ్స్ ఆఫ్ ఢిల్లీ అనే ఎక్స్ అకౌంట్ వీడియోను షేర్ చేసింది. నెటిజన్లు ఆ వీడియోలో ఒకరి బైక్ నంబర్‌ను కూడా షేర్ చేశారు. ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

చివరికి ఈ వీడియో వైశాలి పోలీసులకు దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన బిహార్ పోలీసులు వారి సమాచారాన్ని షేర్ చేయమని నెటిజన్లను కోరారు. తద్వారా వారు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ”దయచేసి ఈ వీడియో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో పూర్తి సమాచారం ఇవ్వండి” అని పోలీసులు రీట్వీట్ చేశారు.

బైక్ హ్యాండ్ వదిలేసి స్టంట్ చేసిన యువతి :
గత నెలలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పూణే వీధుల్లో ఒక మహిళ ప్రమాదకర బైక్ స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. వైరల్ వీడియోలో ఆ మహిళ యమహా RX100 హ్యాండ్స్-ఫ్రీ రైడ్ చేస్తూ సునీల్ శెట్టి పాపులర్ పాట ‘ఆంఖోన్ మే బేసే హో తుమ్’కు చేతులు ఊపుతూ ఫోజులిచ్చింది.

ఈ వీడియోపై పూణె పల్స్ అనే సోషల్ పేజీలో మీడియా ఫేమ్ కోసం బైక్ స్టంట్స్ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సరదా కోసం ప్రాణాలను పణంగా పెట్టడం విలువైనది కాదు. ఇటీవల, హడప్సర్‌లో ఒక అమ్మాయి స్టంట్ చేస్తూ కనిపించింది. ఈ ప్రమాదకరమైన చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీయవచ్చు. అధికారులు స్పందించి సత్వరమే చర్యలు చేపట్టి భద్రత కల్పించాలన్నారు. #StopStunts, StaySafe అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది.

Read Also : Nitin Gadkari : త్వరలో రోడ్లపైకి 132 సీట్లతో పెద్ద బస్సు.. విమానంలో మాదిరిగా బస్ హోస్టెస్‌లు, ఫుడ్ కూడా.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు