Google Employees : కాస్ట్ కటింగ్ అన్నారు.. సీఈఓ పిచాయ్‌‌‌ వేతనం భారీగా పెంచారు.. గూగుల్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి.. నెట్లింట్లో మీమ్స్ వైరల్..!

Google Employees : గూగుల్ కంపెనీలో దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. కాస్ట్ కటింగ్ అంటూ కలరింగ్ ఇచ్చి వేలాది మందిని రోడ్డున పడేసింది. అదే సమయంలో సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని భారీగా పెంచడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Google Employees : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కంపెనీ ఖర్చులు (కాస్ట్ కటింగ్) తగ్గించుకునేందుకు వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపు 12వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది. 2021లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai)కి 226 మిలియన్ డాలర్ల పరిహారంతో ప్యాకేజీ అందించింది. అప్పటినుంచి గూగుల్ ఉద్యోగుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యకమవుతోంది. కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో తీవ్ర విమర్శలకు దారితీసింది. గూగుల్ పేరంట్ కంపెనీ ఆల్ఫాబెట్ (Alphabet) 12వేల ఉద్యోగాలను తొలగించడంతోపాటు, 70 బిలియన్ డాలర్ల స్టాక్ బైబ్యాక్‌కు అధికారాన్ని అప్పగిస్తూ కంపెనీ ఖర్చులను భారీగా తగ్గించుకుంది.

CNBC నివేదిక ప్రకారం.. గూగుల్ ఉద్యోగులు తమ అసంతృప్తిని తెలియజేసేందుకు ఇంటర్నల్ ప్లాట్‌ఫారమ్‌ వేదికగా స్పందిస్తున్నారు. ఒకవైపు కంపెనీలో ఉద్యోగుల తొలగింపుల మధ్య అత్యున్నత హోదాలోని వారికి వేతనాలను పెంచడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ కంపెనీలోని ఇతర CEOలతో పిచాయ్ పరిహారాన్ని పోల్చుతూ అనేక మీమ్స్ వైరల్ చేస్తున్నారు. గూగుల్ ఇంటర్నల్ చర్చా వేదికల్లో డజనుకు పైగా మీమ్‌లు పోస్ట్ అయ్యాయి. వందల కొద్దీ లైక్‌లతో, పిచాయ్ ఇతర చోట్ల ఖర్చులను తగ్గించుకుంటూ పే బంప్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు.

ఇతరుల కన్నా పిచాయ్ ప్యాకేజీనే ఎక్కువ :
2022లో ఆల్ఫాబెట్‌లోని ఇతర ఎగ్జిక్యూటివ్‌ల కన్నా పిచాయ్ పే ప్యాకేజీ చాలా ఎక్కువగా ఉందని గతంలోనే నివేదిక పేర్కొంది. ఉదాహరణకు.. చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్, గూగుల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ ఇద్దరూ దాదాపు 37 మిలియన్ డాలర్లు పరిహారాన్ని అందుకున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ 24.5 మిలియన్ డాలర్లు అందుకున్నారు. వారి స్టాక్ గ్రాంట్లు ఏటా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయా ఫైలింగ్‌లను కంపెనీ వెల్లడిస్తుంది.

Google Employees are unhappy over CEO Sundar Pichai’s pay hike as company

Read Also : Samsung Neo QLED TV : శాంసంగ్ నుంచి కొత్త ప్రీమియం నియో QLED TV స్మార్ట్‌టీవీ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతంటే?

పిచాయ్ వేతనంపై మీమ్స్ వైరల్ :
గూగుల్ ఉద్యోగులు కంపెనీ చర్యలపై నెట్టింట్లో  తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. గూగుల్ సీఈఓ వేతనంపై మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఒక ఉద్యోగి ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ వ్యాఖ్యలతో కూడిన మీమ్‌ను షేర్ చేశారు. కంపెనీలో ఏళ్ల తరబడిగా ఉద్యోగాల్లో కోతలను విధిస్తోందని ఇమెయిల్‌లో రాసుకొచ్చారు. దీన్ని గూగుల్ ఉద్యోగులు మీమ్స్‌గా వైరల్ చేస్తున్నారు. రూత్ ఖర్చు ఆదా అందరికీ వర్తిస్తుంది. మాలా కష్టపడి పనిచేసే VPS, CEOలకు తప్ప అని అందులో ఉంది. మరో మీమ్‌లో ‘12వేల మంది గూగ్లర్‌లను తొలగించడం, ప్రోత్సాహకాలు తగ్గించడం, వారిలో ధైర్యాన్ని, సంస్కృతిని నాశనం చేస్తున్నప్పుడు సుందర్ పిచాయ్ మాత్రం 226 మిలియన్ డాలర్లను వేతనంగా తీసుకుంటారా?’ అనే టెక్స్ట్‌తో ష్రెక్ పాత్ర లార్డ్ ఫర్‌క్వాడ్ ఫొటోతో మీమ్ వైరల్ చేస్తున్నారు.

వాళ్లే కాదు.. నా బోనస్ కూడా వదులుకుంటున్నా : పిచాయ్ రిప్లయ్
గత జనవరిలో పిచాయ్ గూగుల్ ఉద్యోగుల తొలగింపుపై నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల తొలగింపులకు దారితీసిన పరిస్థితులకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు చెప్పారు. ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఉద్యోగులు పిచాయ్‌ను ఇదే విషయాన్ని అడిగారు. అందుకు తాను బాధ్యత వహిస్తే.. ఎగ్జిక్యూటివ్‌లు ఎందుకు వేతనాల్లో కోతలను అందుకుంటున్నారని అన్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు తమ బోనస్‌లలో గణనీయమైన తగ్గింపులు తీసుకుంటున్నారని, తన బోనస్‌ను సైతం వదులుకుంటున్నానని పిచాయ్ సమాధానమిచ్చారు. మరోవైపు.. 70 బిలియన్ డాలర్ల స్టాక్‌ను తిరిగి కొనుగోలు చేయాలనే గూగుల్ ప్రణాళికపై కూడా ఉద్యోగుల్లో నిరాశను రేకెత్తించింది.

Read Also : Apple iPhones Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఐఫోన్ 13, ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇందులో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

ట్రెండింగ్ వార్తలు