భారీ ఎన్‌కౌంటర్‌.. 11 మంది మావోయిస్టుల మృతి

మొత్తం 1400 మంది భద్రతా బలగాలు ఈ కూంబింగ్‌లో..

నారాయణపూర్ జిల్లా అబుజ్‌మద్‌లోని కోహ్కమెటా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. భారీ ఎన్ కౌంటర్‌లో 11 మంది మావోయిస్టులు మృతి చెందిన్నట్లు సమాచారం. అందులో 11 మంది మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్యను జవాన్లు అధికారికంగా నిర్ధారించలేదు.

డీఆర్జీ బృందంతో పాటు ఛత్తీస్‌గఢ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ దళాలు, వివిధ జిల్లాల నుండి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది కలిసి కూంబింగ్ లో పాల్గొన్నారు. జవాన్లను లక్ష్యంగా చేసుకునేందుకు మావోయిస్టులు బంకర్లను నిర్మించినట్లు సమాచారం.

కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. మొత్తం 1400 మంది భద్రతా బలగాలు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారు. అలాగే, పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Also Read: పెన్షన్ డబ్బు రూ. 2 లక్షలతో ఇద్దరు సెక్రటరీలు అదృశ్యం, తన సొంత డబ్బు ఇచ్చిన మంత్రి

ట్రెండింగ్ వార్తలు