తప్పు చేసిన వాళ్ళని ఉరి తీయండి- దస్త్రాల దహనంపై మాజీమంత్రి పేర్ని నాని

ప్రభుత్వం మీది.. ఫైల్స్ తగలబెడితే మాకేంటి సంబంధం..? అని ప్రశ్నించారు.

Perni Nani : ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల (ఫైల్స్, రిపోర్ట్స్) దహనం ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దస్త్రాలు ఎందుకు కాల్చేశారు? దీని వెనుక ఎవరున్నారు? ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్స్ దగ్ధం చేశారు? అనేది మిస్టరీగా మారింది. ఫైల్స్ దగ్ధం ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణ చేపట్టింది. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునే పనిలో పడింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఫైల్స్ దగ్ధం ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు.

ప్రభుత్వం మీదే కదా..? పీసీబీ, మైనింగ్ శాఖ ఫైల్స్ దగ్ధంపై విచారణ చేయండి అని పేర్ని నాని అన్నారు. ప్రభుత్వం మీది.. ఫైల్స్ తగలబెడితే మాకేంటి సంబంధం..? అని ప్రశ్నించారు. మీ ఫైల్స్ దగ్ధం జరిగితే మీరంతా ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. దస్త్రాలు ఎక్కడి నుండి వచ్చాయో? ఎవరు పంపించారో? విచారణ చేసుకోండి అని ప్రభుత్వానికి సూచించారు. దీనిపై సీబీఐ విచారణ చేసుకుని తప్పు చేసిన వాళ్ళని ఉరి తీసేయండి అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

మరోవైపు జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఘనంగా జరపాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారని పేర్ని నాని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చెయ్యాలని నేతలకు, క్యాడర్ కు పిలుపునిచ్చారన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసమే వైసీపీ పుట్టిందని పేర్ని నాని పేర్కొన్నారు.

Also Read : జగన్ మళ్లీ జైలుకెళ్లే సమయం వచ్చింది- మంత్రి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు