#Twitter Down : ట్విట్టర్‌కు ఏమైంది.. మళ్లీ నిలిచిపోయిన సర్వీసులు.. మస్క్‌పై మండిపడుతున్న యూజర్లు.. ఉద్యోగుల తొలగింపు కారణమా?

#Twitter Down : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter)కు ఏమైంది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్ అయింది. గంటకు పైగా ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో ట్విట్టర్ యూజర్లు సర్వీసులను యాక్సెస్ చేయలేకపోతున్నారు.

#Twitter Down : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter)కు ఏమైంది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్ అయింది. గంటకు పైగా ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో ట్విట్టర్ యూజర్లు సర్వీసులను యాక్సెస్ చేయలేకపోతున్నారు. ట్విట్టర్ సర్వర్ డౌన్ కావడం ఇది మొదటిసారి కాదు.. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి అనేక సార్లు ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోయాయి. ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మస్క్ అనేక కఠినమైన నిర్ణయాలను తీసుకున్నాడు. వేలాది మంది ఉద్యోగులను తొలగించాడు.

ఒకవైపు ట్విట్టర్ ఉద్యోగులను తొలగింపు కొనసాగుతుండగా.. మరోవైపు ట్విట్టర్ సర్వీసుల్లో సమస్యలు తలెత్తడంతో యూజర్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ట్విట్టర్ డౌన్ కావడంపై పలువురు యూజర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో #TwitterDown అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.

Twitter is down for hours and tweets not showing up, Elon Musk fired 200 employees just a day ago

Read Also :  Vivo V27 Series Launch : వివో V27 సిరీస్, వివో TWS ఎయిర్ లాంచ్, ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

ఈ ట్యాగ్ ద్వారా ట్విట్టర్ యూజర్లు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది యూజర్లు తమ ట్విట్టర్ అకౌంట్ పనిచేయకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ట్విటర్ డౌన్ అయిందని, ట్వీట్‌లు లోడ్ కావడం లేదనే స్క్రీన్ షాట్లతో ఇతర ప్లాట్ ఫాంలలో పోస్టులు పెడుతున్నారు. Twitter సర్వీసులు పదేపదే ఇలా డౌన్ కావడం పట్ల యూజర్లలో కలవరానికి గురి చేస్తోంది.

ఎలన్ మస్క్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచే ట్విట్టర్ ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. భారత్ సహా బ్రిటన్, అమెరికా, జపాన్ అనేక దేశాల్లో ట్విటర్ యూజర్లు సర్వీసులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మస్క్ 200 వందల మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించిన మరుసటిరోజునే అకస్మాత్తుగా ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోయాయని అంటున్నారు. ఎలన్ మస్క్ పిచ్చి తుగ్లక్ చర్యల కారణంగానే ట్విట్టర్‌ పరిస్థితి ఇలా అయిందని యూజర్లు తిట్టిపోస్తున్నారు.

ప్రస్తుతం.. #TwitterDown ప్లాట్‌ఫారమ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ట్విటర్ సీఈఓ ఎలన్ మస్క్ తన బృందంతో కలిసి ట్విట్టర్‌లో అన్ని సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నారని ఓ నివేదిక తెలిపింది. అయితే, చూస్తుంటే పరిస్థితి అలా కనిపించడం లేదని ట్విట్టర్ యూజర్లు అంటున్నారు. ఇప్పుడు, #TwitterDown కోసం సెర్చ్ చేస్తే ఎలోన్ మస్క్ ప్రొఫైల్ పాప్ అప్ అవుతుంది. ఇతర సెర్చ్ రిజిల్ట్స్ ‘Twitter Down రిజల్ట్స్ కూడా కనిపించడం లేదని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్ :
ట్విటర్ ప్రస్తుత ఫీడ్‌ కనిపించడం లేదు. ట్విట్టర్ హోంపేజీలో ప్రస్తుతం “Twitterకి స్వాగతం అనే మెసేజ్ కనిపిస్తోంది. డెస్క్‌టాప్‌తో పాటు మొబైల్ యాప్‌లోనూ ఇదే మెసేజ్ కనిపిస్తుంది. వినియోగదారులకు మరింత ఈజీగా ఉండేలా ప్లాట్ ఫారంను మరింత మెరుగుపర్చేందుకు ట్విట్టర్ కృషి చేస్తోందని ఇటీవలే మస్క్ చెప్పారు. ట్విట్టర్ సర్వీసులు గంటకు పైగా నిలిచిపోవడంతో అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ DownDetector కూడా వందల కొద్దీ ఫిర్యాదులను చూపిస్తోంది. ట్విట్టర్ ఫీడ్‌తో సమస్య మొబైల్ యాప్, డెస్క్‌టాప్ రెండింటిలోనూ ఉందని వినియోగదారులు DownDetector వేదికగా తమ ఫిర్యాదులను పోస్టు చేస్తున్నారు.


Twitter అకౌంట్లలో స్నేహితులు లేదా కాంటాక్టుల నుంచి ట్వీట్‌లను చూపడం లేదు. కానీ, ట్వీట్‌ను పోస్ట్ చేయవచ్చు. ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్‌లో అత్యంత ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లలో ఒకటి #TwitterDown దాని కింద వేలాది ట్వీట్లు ఉన్నాయి. కేవలం ఫీడ్‌తో మాత్రమే కొంత సమస్య ఉన్నట్టు కనిపిస్తోంది. కొంతమంది వినియోగదారుల ఫాలోవర్ల లిస్టు కనిపించడం లేదని వాపోతున్నారు.

Read Also : Twitter 2FA Setup : వచ్చే మార్చి నుంచి ట్విట్టర్‌ యూజర్లు ఛార్జీలు చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు