Unmarried : హర్యానాలో పెళ్లి కాని వారికి శుభవార్త…త్వరలో పెన్షన్ పథకం

పెళ్లి కాని వారికి హర్యానా సర్కారు శుభవార్త వెల్లడించింది. హర్యానా రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల పెళ్లి కాని వారికి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని హర్యానా సర్కారు యోచిస్తోంది....

pension

Unmarried : పెళ్లి కాని వారికి హర్యానా సర్కారు శుభవార్త వెల్లడించింది. హర్యానా రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల పెళ్లి కాని వారికి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని హర్యానా సర్కారు యోచిస్తోంది. (Haryana likely to get pension) హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా కమల్ పురా గ్రామంలో జన్ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 60 ఏళ్ల వయసున్న అవివాహిత వ్యక్తి పెన్షన్ సంబంధిత ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం ఖట్టర్ మాట్లాడుతూ హర్యానా ప్రభుత్వం త్వరలో అవివాహితులకు పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తుందన్నారు. పెళ్లి కాని వారికి నెలరోజుల్లో పెన్షన్ ఇవ్వాలనే విషయంపై తాము నిర్ణయం తీసుకుంటామని సీఎం ఖట్టర్ వెల్లడించారు.

Israel attacks : జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి, 8 మంది పాలస్తీనియన్ల మృతి

హర్యానా ప్రభుత్వ ప్రతిపాదిత పెన్షన్ పథకం కింద 2లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. హర్యానా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులు, మరుగుజ్జులు, ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్‌లను అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎం ఖట్టర్ వృద్ధాప్య పింఛనును రూ.250 నుంచి నెలకు రూ.3,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు.

Taliban Ban : అప్ఘానిస్థాన్‌లో మహిళా బ్యూటీ సెలూన్లపై తాలిబన్ల నిషేధాస్త్రం

ఒంటరిగా ఉన్నవారికి పెన్షన్లు ఇచ్చే కొత్త పథకం 2024వ సంవత్సరంలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో ముడిపడి ఉంది. మహిళల సంఖ్య తక్కువగా ఉన్నందున హర్యానా రాష్ట్రానికి చెందిన ఒంటరి పురుషులు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, బీహార్, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల మహిళలను పెళ్లి చేసుకోవలసి వస్తుంది. హర్యానా యువకులు ఇతర రాష్ట్రాల వధువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు