Taliban Ban : అప్ఘానిస్థాన్‌లో మహిళా బ్యూటీ సెలూన్లపై తాలిబన్ల నిషేధాస్త్రం

అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్లు కొత్తగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాబూల్ నగరంతోపాటు దేశవ్యాప్తంగా మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధాస్త్రాన్ని విధించారు.....

Taliban Ban : అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్లు కొత్తగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాబూల్ నగరంతోపాటు దేశవ్యాప్తంగా మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధాస్త్రాన్ని విధించారు. దేశంలో మహిళల బ్యూటీ సెలూన్ల లైసెన్సులను రద్దు చేయాలని తాలిబన్ వైస్, ధర్మ మంత్రిత్వశాఖ కాబూల్ (Kabul) మున్సిపాలిటీని ఆదేశించింది. (Ban Women Beauty Salons)

Israel attacks : జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి, 8 మంది పాలస్తీనియన్ల మృతి

పురుషులు ఉద్యోగాలు లేకుండా ఉన్నపుడు తాము జీవనోపాధి కోసం బ్యూటీ సెలూన్లలో పనిచేయాల్సి వస్తుందని, వీటిని నిషేధిస్తే తాము ఎలా బతకాలని మేకప్ ఆర్టిస్ట్ రైహాన్ ముబారిజ్ ప్రశ్నించారు. తాలిబన్ ప్రభుత్వం బ్యూటీ సెలూన్ల ఏర్పాటు కోసం ఇస్లాం పద్ధతిలోనే ఒక ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయాలని కాబూల్ నివాసి అబ్దుల్ ఖబీర్ సూచించారు. అప్ఘానిస్థాన్ దేశంలో బాలికలు, మహిళలపై ఆంక్షలు విధించడంపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ట్రెండింగ్ వార్తలు