Pat Cummins Picks First Hat Trick of T20 World Cup 2024
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ ఈ ఘనత సాధించాడు. ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదో బంతికి మహ్మదుల్లా, ఆరో బంతికి (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి తౌహిద్ హృదోయ్‌లను ఔట్ చేశాడు.
ఈ ప్రపంచకప్‌లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. ఓవరాల్‌గా ఏడోది. ఇక ఆస్ట్రేలియా తరుపున హ్యాట్రిక్ తీసిన రెండో ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. ఇంతకముందు 2007లో బ్రెట్ లీ హ్యాట్రిక్ సాధించాడు. అతడు కూడా బంగ్లాదేశ్ పైనే సాధించడం గమనార్హం.
VVS Laxman : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..! జింబాబ్వే పర్యటనకు..!
టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు వీరే..
బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) – 2007లో బంగ్లాదేశ్ పై
కర్టిస్ క్యాంపర్ (ఐర్లాండ్) – 2021లో
వనిందు హసరంగ (శ్రీలంక) – 2021లో
కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) – 2021లో
కార్తిక్ మైయప్పన్ (యూఏఈ) – 2022లో
జోష్ లిటిల్ (ఐర్లాండ్) – 2022లో
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 2024లో
ఇక ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో షాంటో (41), తౌహిద్ (40) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు తీయగా, ఆడమ్ జంపా రెండు వికెట్లు పడగొట్టాడు. మాక్స్‌వెల్, స్టోయినిస్, మిచెల్ స్టార్క్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 11.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (55 నాటౌట్), గ్లెన్ మాక్స్‌వెల్ (14 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ దశలో భారీ వర్షం కురిసింది. మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.
HAT-TRICK FOR PAT CUMMINS!!
– Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. ?pic.twitter.com/qh0ZCFAkHF
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024