Virat Kohli-Surya Kumar : కోహ్లి ప్రపంచ రికార్డును సమం చేసిన సూర్యా భాయ్.. బద్దలు కొట్టేందుకు ఒక్క మ్యాచ్ చాలు..!
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు.

Suryakumar Yadav equals Kohli record for most Man of the Match awards in T20I cricket
Virat Kohli – Surya Kumar Yadav : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బార్బడోస్ వేదికగా గురువారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడడంతో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా మరో స్టార్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూర్య, కోహ్లిలు చెరో 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. కాగా.. విరాట్ కోహ్లి 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచులు అవసరం కాగా.. సూర్య కుమార్ యాదవ్ కేవలం 64 మ్యాచుల్లోనే సాధించాడు. వీరిద్దరి తరువాత స్థానాల్లో విరన్‌దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మహ్మద్ నబీ (14) లు ఉన్నారు.
Quinton de Kock : క్వింటన్ డికాక్ అరుదైన ఘనత..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకుంది..
సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 64 మ్యాచుల్లో 15 సార్లు
విరాట్ కోహ్లి (భారత్) – 121 మ్యాచుల్లో 15 సార్లు
విరందీప్ సింగ్ (మలేషియా) – 78 మ్యాచుల్లో 14 సార్లు
సికందర్ రజా (జింబాబ్వే) – 86 మ్యాచుల్లో 14 సార్లు
మహ్మద్ నబి (అఫ్గానిస్తాన్) – 126 మ్యాచుల్లో 14 సార్లు
ఇక భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 32) లు రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ, రషీద్ ఖాన్ లు చెరో మూడు వికెట్లు తీశారు. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ పడగొట్టాడు.
Pakistan : 17 మంది ఆటగాళ్లు.. 60 గదులు.. ఏం తమాషాగా ఉందా..?
అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(20 బంతుల్లో 26) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఓ వికెట్ సాధించారు.