Quinton de Kock : క్వింటన్ డికాక్ అరుదైన ఘనత..
దక్షిణాఫ్రికా వికెప్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు.

Quinton de Kock
దక్షిణాఫ్రికా వికెప్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో డికాక్ 40 బంతుల్లో 74 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ ను అధిగమించాడు.
ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు. సంగక్కర 84 ఇన్నింగ్స్‌ల్లో 2855 పరుగులు చేశాడు. డికాక్ 53 ఇన్నింగ్స్‌ల్లో 1685 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్లు..
కుమార సంగక్కర (శ్రీలంక) – 84 ఇన్నింగ్స్‌ల్లో 2855 పరుగులు
క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) – 53 ఇన్నింగ్స్‌ల్లో 1685 పరుగులు
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 50 ఇన్నింగ్స్‌ల్లో 1636 పరుగులు
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 56 ఇన్నింగ్స్‌ల్లో 1550 పరుగులు
ముష్ఫికర్ రహీం (బంగ్లాదేశ్) – 61 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో డికాక్ (74) హాఫ్ సెంచరీ బాదగా మార్క్రమ్ (46), క్లాసెన్ (36 నాటౌట్) లు రాణించారు. అనంరతం లక్ష్య ఛేదనలో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 176 పరుగులకే పరిమితమైంది. దీంతో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Quinton de Kock has surpassed Australian legend Adam Gilchrist for the most runs by a wicketkeeper in ICC events. pic.twitter.com/XDS9onxdof
— CricTracker (@Cricketracker) June 20, 2024