Some Indian Millionaires Are Migrating To This Country ( Image Source : Google )
Indian Millionaires Migration : ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన భారత్ ఒకటి. అయితే, ప్రస్తుత పోటీప్రపంచంలో అనేక రంగాల్లోనూ భారత్ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. అయినప్పటికీ మన భారతీయులు చాలామంది సొంత దేశాన్ని వదిలిపెట్టి పక్క దేశాలకు వలసబాటపడుతున్నారు. అందులో భారతీయ మిలియనీర్లు ఎక్కువ మంది ఉన్నారు. వారిలో పెట్టుబబడిదారుల నుంచి వ్యాపారులు ఇలా అనేక రంగాలకు చెందిన భారత కోటీశ్వీరులు ‘చలో అబ్రాడ్’ అంటూ విమానాల్లో విదేశాలకు చెక్కేస్తున్నారు.
ఇప్పటికే చాలామంది మిలియనీర్లు ఇతర దేశాలకు మకాం మార్చేశారు. అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ.. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ఇటీవలి నివేదిక ప్రకారం.. ఈ (2024) ఏడాదిలో సుమారు 4,300 మంది మిలియనీర్లు భారత్ వదిలి వెళ్లనున్నారని అంచనా వేసింది. గత ఏడాది ఇదే నివేదికలో 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు.
85శాతం సంపద వృద్ధితో కొత్త మిలియనీర్లు :
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్.. చైనా, యూకే తర్వాత మిలియనీర్ వలసల పరంగా ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంటుందని అంచనా. భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించింది. భారత నికర మిలియనీర్ ఎక్సోడస్ చైనాలో 30శాతం కన్నా తక్కువ. భారత్ ప్రతి ఏడాదిలో వేలాది మంది మిలియనీర్‌లను కోల్పోతుండగా.. అనేక మంది యూఏఈలకు వలస వెళ్తున్నారు.
గత దశాబ్దంలో 85శాతం సంపద వృద్ధితో ఈ అరబ్ దేశం ఇంకా కొత్త మిలియనీర్లను తయారుచేస్తూనే ఉంది. తద్వారా వలసలు పెరిగిన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదిక పేర్కొంది. వలస వెళ్లే మిలియనీర్లలో చాలామంది భారత్‌లో వ్యాపార ప్రయోజనాలు మాత్రమే కాదు.. సొంత దేశంలో ఇళ్లను కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. భారత్‌తో కొనసాగుతున్న ఆర్థిక సంబంధాలను సూచిస్తుందని తెలిపింది.
యూఏఈలో విస్తరించిన ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సెక్టార్ :
భారతీయ ప్రైవేట్ బ్యాంకులు, వెల్త్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, క్లయింట్‌లకు అవసరమైన పెట్టుబడి సేవలను అందించడానికి యూఏఈలో విస్తరిస్తున్నాయి. ఉదాహరణకు.. నువామా ప్రైవేట్, ఎల్‌జీటీ వెల్త్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి. ఈ రెండూ ప్రపంచ వైవిధ్యం, విస్తరణ అవసరాలతో భారతీయ క్లయింట్‌లకు సపోర్టును అందిస్తున్నాయి.
అదేవిధంగా, ఇతర బ్యాంకులు కూడా యూఏఈలో తమ ఉనికిని పెంచుకుంటున్నాయి. భారతీయ కుటుంబాలకు పోటీతత్వ సంపద నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. యూఏఈలో స్థిరపడిన భారతీయ కుటుంబాలకు సంపద నిర్వహణ సేవలను అందించడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ 360 వన్ వెల్త్ డాట్స్‌లో చేరుతున్నాయని, తమ పోటీదారులను కోల్పోకుండా చూసుకుంటారని హెన్లీ నివేదిక పేర్కొంది.
మిలియనీర్ మైగ్రేషన్ ప్రాముఖ్యత :
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,28,000 మంది మిలియనీర్లు 2024లో వలస వెళ్లనున్నారని అంచనా వేసింది. యూఏఈ, యూఎస్ఏ దేశాలు ప్రధానంగా గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. వలస వచ్చిన మిలియనీర్లు తమతో ఆస్తులను విదేశీ మారక నిల్వల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దాంతో పెట్టుబడులు, ఈక్విటీ ప్లేస్‌మెంట్ల ద్వారా స్థానిక స్టాక్ మార్కెట్లను సైతం పుంజుకునేలా చేస్తున్నాయి.
అంతేకాదు.. మిలియనీర్లు స్థాపించిన అనేక వ్యాపారాలు భారీ వేతనాలను చెల్లించి మరి ఉద్యోగాలను సృష్టిస్తున్నారు. టెక్ దిగ్గజాల్లో మైక్రోసాఫ్ట్, ఆపిల్, టెస్లా వంటి కంపెనీలు యూఎస్ఏలో తమ ఉనికిని మరింత పెంచుకుంటున్నాయి. వాస్తవానికి మిలియనీర్ అంటే.. మొత్తం ఒక మిలియన్ డాలర్ లేదా అంతకంటే ఎక్కువ లిక్విడ్ ఇన్వెస్ట్ చేయదగిన ఆస్తులను కలిగిన వ్యక్తిగా చెప్పవచ్చు.
వలసలకు కారణాలివే :
భద్రత, ఆర్థిక పరిగణనలు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మొత్తం జీవన ప్రమాణాలతో సహా వివిధ కారణాల వల్ల భారతీయ కోటీశ్వరుల కుటుంబాలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు.