India’s Richest Billionaires : 30 ఏళ్లలోపు యువ భారతీయ బిలియనీర్లలో సైరస్ మిస్త్రీ కుమారులు.. ఇంతకీ జహాన్, ఫిరోజ్ ఎవరంటే?

India's Richest Billionaires : 30 ఏళ్లలోపు యువ భారతీయ బిలియనీర్లలో సైరస్ మిస్త్రీ కుమారులు జహాన్, ఫిరోజ్ ముందంజలో నిలిచారు. ఇంతకీ వీరు ఎవరంటే?

India’s Richest Billionaires : 30 ఏళ్లలోపు యువ భారతీయ బిలియనీర్లలో సైరస్ మిస్త్రీ కుమారులు.. ఇంతకీ జహాన్, ఫిరోజ్ ఎవరంటే?

Meet Cyrus Mistry's Sons, India's Richest Billionaires Under 30

India’s Richest Billionaires : 2024కి సంబంధించిన లేటెస్ట్ ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా విడుదల అయింది. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 25 మంది పిన్నవయస్కులైన బిలియనీర్లు ఉండగా.. 33 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే, ఈ యువ బిలియనీర్ల మొత్తం సంపద 110 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. ఇందులో చాలామంది యువ బిలియనీర్లు సొంత సంపాదన కాకుండా వారసత్వంగా సంక్రమించిన సంపదను కలిగిన వారే గణనీయంగా ఉన్నారు.

Read Also : Lachhman Das Mittal : ఎల్‌ఐసీ మాజీ ఏజెంట్.. భారత అత్యంత వృద్ధ బిలియనీర్‌గా లక్ష్మణ్ దాస్ మిట్టల్..!

30 ఏళ్లలోపు యువ భారతీయ బిలియనీర్లలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కుమారులు జహాన్, ఫిరోజ్ ముందంజలో నిలిచారు. వీరిద్దరూ మొత్తంగా 9.8 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ 4.9 బిలియన్ డాలర్లను వారసత్వంగా పొందారు. తండ్రి సైరన్ మిస్త్రీ 2022లో కారు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కుమారులైన జహాన్, ఫిరోజ్‌కు వారసత్వంగా తండ్రి సంపదను పొందారు.

జహాన్ మిస్త్రీ ఎవరు? :
జహాన్ మిస్త్రీ వయస్సు 25ఏళ్లు.. టాటా హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత సైరస్ మిస్త్రీ కుమారుడే జహాన్ మిస్త్రీ.. సైరస్ మిస్త్రీ మరణించిన తర్వాత జహాన్ తన కుటుంబ సంపదలో కొంత భాగాన్ని వారసత్వంగా పొందారు. ఇందులో టాటా సన్స్‌లో 150 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే వారి 18.4శాతం వాటా కూడా ఉంది.

జహాన్ యేల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా. ముంబైకి చెందిన నిర్మాణ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో జహాన్ 25శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆయన మామ షాపూర్ మిస్త్రీ ఛైర్మన్‌గా ఉన్నారు. జహాన్ మిస్త్రీ ఐర్లాండ్‌లో పౌరసత్వం కలిగి ఉండగా.. ప్రస్తుతం ముంబైలో జహాన్ నివసిస్తున్నారు.

ఫిరోజ్ మిస్త్రీ ఎవరంటే? :
ఫిరోజ్ మిస్త్రీ వయస్సు 27 ఏళ్లు.. దివంగత సైరస్ మిస్త్రీకి ఈయన పెద్ద కుమారుడు. తండ్రి మరణానంతరం టాటా సన్స్‌లో 18.4శాతం వాటాను ఫిరోజ్ వారసత్వంగా పొందారు. ఆయన మామ అధ్యక్షతన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో 25శాతం వాటాను పొందారు. ప్రైవేట్‌ నిర్మాణ, ఇంజనీరింగ్ సంస్థ అయిన ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను లిస్టింగ్ చేయడం ద్వారా నిధులను సేకరించే పనిలో పడ్డారు ఫిరోజ్ మిస్త్రీ. యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో ఫిరోజ్ చదువుకున్నారు. ఐరిష్ పౌరసత్వం ఉన్నప్పటికీ.. ఆయన ముంబైలో నివసిస్తున్నారు.

Read Also : Disney Plus : నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీప్లస్.. వచ్చే జూన్ నుంచి పాస్‌వర్డ్ షేరింగ్‌ కుదరదు..!