Lachhman Das Mittal : ఎల్‌ఐసీ మాజీ ఏజెంట్.. భారత అత్యంత వృద్ధ బిలియనీర్‌గా లక్ష్మణ్ దాస్ మిట్టల్..!
అప్పట్లో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసిన లక్ష్మణ్ దాస్ మిట్టల్.. సోనాలికా ట్రాక్టర్ అధినేతగా ఎదిగి.. 93ఏళ్ల వయస్సులోనూ దేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్‌గా కొనసాగుతున్నారు.

Former LIC Agent Lachhman Das Mittal Is India's Oldest Billionaire
Lachhman Das Mittal : ఎల్ఐసీ ఏజెంట్‌గా కెరీర్ మొదలుపెట్టి.. రిటైర్మ్‌మెంట్ తర్వాత బిజినెస్‌లో రాణించి ఇప్పుడు దేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్‌గా అవతరించారు. ఆయన ఎవరో కాదు.. సోనాలికా ట్రాక్టర్ అధినేత లక్ష్మన్ దాస్ మిట్లల్.. ఈయన్ను లచ్మన్ దాస్ మిట్టల్ అని కూడా పిలుస్తారు. 2024 ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో మిట్టల్ మరోసారి దేశంలోనే వృద్ధ బిలియనీర్‌గా నిలిచారు.
Read Also : భారత్‌లో అత్యంత ధనవంతుడిగా ముకేశ్.. టాప్-10 కుబేరులు వీరే.. ఎన్ని కోట్లాది రూపాయలున్నాయో తెలుసా?
93ఏళ్ల వయస్సులోనూ బిలియనీర్‌గా కొనసాగుతూ మిగతా బిలియనీర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో ఈ టైటిల్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99) పేరిట ఉండగా.. ఆయన ఏప్రిల్ 12, 2023న మరణించారు. ఆయన మరణంతో ఆ స్థానాన్ని ఇప్పుడు లక్ష్మణ్ దాస్ మిట్టల్ దక్కించుకున్నారు. మిట్టల్ జీవిత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- లక్ష్మణ్ దాస్ మిట్టల్ 1931లో పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జన్మించారు.
- ఎల్‌ఐసీలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేసేవారు.
- పంజాబ్ యూనివర్శిటీలో మిట్టల్ ఉర్దూలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
- ఆ తర్వాత మారుతీ ఉద్యోగ్‌లో డీలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన్ను తిరస్కరించారు.
- రిటైర్మెంట్ తర్వాత మిట్టల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు
- ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ITL)ని నిర్మించారు
- 1990లో 60 ఏళ్ల వయస్సులో సోనాలికా ట్రాక్టర్స్ కంపెనీని స్థాపించారు.
- సోనాలికా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 5 దేశాలలో ప్లాంట్‌లతో 120కి పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
- మిట్టల్ కంపెనీ పలు పదవుల నుంచి తప్పుకోగా ఆయన కుటుంబం కీలకంగా వ్యవహరిస్తోంది.
- ఆయన పెద్ద కుమారుడు అమృత్ సాగర్ కంపెనీకి వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
- చిన్న కుమారుడు దీపక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
- మిట్టల్ మనవలు, సుశాంత్, రామన్ కూడా కంపెనీలో పలు హోదాల్లో పనిచేస్తున్నారు
- మిట్టల్ కుమార్తె ఉషా సంగవాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మొదటి మహిళా మేనేజింగ్ డైరెక్టర్. ఆమె ఇప్పుడు పదవీ విరమణ చేశారు.
Read Also : భారతీయ న్యూ బిలియనీర్ రేణుకా జగ్తియాని ఎవరు? ఆమె పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా..