భారతీయ న్యూ బిలియనీర్ రేణుకా జగ్తియాని ఎవరు? ఆమె పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా..

ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 ఏడాదికి ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఇందులో 25 మంది ఇండియాకు చెందిన కొత్త బిలియనీర్లు యాడ్ అయ్యారు.

భారతీయ న్యూ బిలియనీర్ రేణుకా జగ్తియాని ఎవరు? ఆమె పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా..

Renuka Jagtiani

Renuka Jagtiani : ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 ఏడాదికి ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఇందులో 25 మంది ఇండియాకు చెందిన కొత్త బిలియనీర్లు యాడ్ అయ్యారు. ఆ జాబితాలో రేణుకా జగ్తియాని ఉన్నారు. జగ్తియాని ల్యాండ్‌మార్క్ గ్రూప్ సీఈవో. ఆమె నికర విలువ సుమారు 4.8 బిలియన్లు. భారతీయ సంతతికి చెందిన రేణుకా జగ్తియాని భర్త మిక్కి జగ్తియాని ల్యాండ్‌మార్క్ గ్రూప్ ను స్థాపించాడు. ఆయన అనారోగ్యం కారణంగా మరణించాడు. ఆ తరువాత రేణుకా జగ్తియాని కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆర్డ్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని యూనివర్శిటీ ఆఫ్ ముంబై నుంచి పూర్తి చేశారు. ఎలాంటి వ్యాపార అనుభవం లేని రేణుక 1993లో ల్యాండ్ మార్క్ గ్రూపులోకి అడుగు పెట్టి.. వేగంగా వ్యాపార నైపుణ్యాలను అందిపుచ్చుకోవటమే కాకుండా.. ప్రపంచ దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తున్నారు.  ప్రస్తుతం దేశంలోని ధనవంతుల జాబితాలో రేణుకా జగ్తియాని 44వ స్థానంలో ఉన్నారు.

Also Read : Katchatheevu Island Issue : కచ్చతీవు ద్వీపం ఎక్కడుంది.. భారత్- శ్రీలంక వివాదం ఎందుకు..

మిక్కీ జగ్తియాని మొదట లండన్ వీధుల్లో ట్యాక్సీ డ్రైవర్ గా, హోటల్ క్లీనర్ గా కెరీర్ ప్రారంభించాడు. 1973లో తన తల్లిదండ్రులు, సోదరుడు హఠాన్మరణం చెందడంతో బహ్రెయిన్ కు వెళ్లి అక్కడ తన సోదరుడి బొమ్మల దుకాణాన్ని నిర్వహించడం ప్రారంభించాడు. పదేళ్ల పాటు పిల్లల బొమ్మల షాపును నడిపించి కుటుంబాన్ని పోషించాడు. అదే సమయంలో తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ముందుకు అడుగులు వేశాడు. గల్ఫ్ యుద్ధం ముగిసిన తరువాత, అతను దుబాయ్ చేరుకొని అక్కడ తన ల్యాండ్‌మార్క్ గ్రూప్‌ను ప్రారంభించాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని మిక్కీ జగ్తియాని స్థాపించాడు. ల్యాండ్‌మార్క్ గ్రూప్ ప్రధాన కార్యాలయం దుబాయ్ లో ఉంది. దుస్తులు, చెప్పులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కాస్మోటిక్, కాస్మోటిక్ ప్రొడక్ట్స్ వంటి వాటిని విక్రయిస్తోంది. ఈ సంస్థ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టి రాణిస్తోంది. లాండ్ మార్క్ 21 దేశాల్లో 2200 కంటే ఎక్కువ స్టోర్లలో తమ బ్రాండ్ లతో వియపథంలో దూసుకుపోతుంది. ఈ గ్రూపులో సుమారు 50వేల మంది ఉద్యోగం చేస్తున్నారు. భారతదేశంలో ల్యాండ్‌మార్క్ గ్రూప్ వ్యాపారాన్ని 1999లో ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీకి దేశంలో 900 కంటే ఎక్కువ స్టోర్లు ఉన్నాయి.

Also Read : భారత్‌లో అత్యంత ధనవంతుడిగా ముకేశ్.. టాప్-10 కుబేరులు వీరే.. ఎన్ని కోట్లాది రూపాయలున్నాయో తెలుసా?

జగ్తియాని ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ లో 4.8 బిలియన్ల నికర విలువతో కొనసాగుతున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఆర్తి, నిషా, రాహుల్. వీరు ముగ్గురు ల్యాండ్ మార్క్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. రేణుకా జగ్తియాని అనేక అవార్డులను అందుకున్నారు. వాటిలో కొన్ని..

  • 2007 జనవరిలో ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ మిడిల్ ఈస్ట్ లో అత్యుత్తమ ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.
    2012లో గల్ఫ్ బిజినెస్ ఇండస్ట్రీ అవార్డ్స్ లో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు అందుకున్నారు.
    2014లో వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఫోరమ్ రేణుక జగ్తియాను ప్రపంచ వ్యాపార వేత్తగా గౌరవించింది.
    2015లో ఆమె ఇండియన్ సీఈఓ అవార్డ్స్ లో స్ట్రాటజిక్ లీడర్ ఆప్ ది ఇయర్ గా ఎంపికయ్యారు.
    2016లో స్టోర్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్ నుంచి ఆమె కెప్టెన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవార్డును అందుకున్నారు.
    2017లో వరల్డ్ రిటైల్ కాంగ్రెస్ లో హాల్ ఆఫ్ ఫేమ్ లో ఆమెను చేర్చారు.