NtrNeel: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈ ఇయర్ లో ‘డ్రాగన్’ రావడం కష్టమే.. కారణం ఏంటో తెలుసా?
వచ్చే ఏడాదికి వాయిదా పడనున్న ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్(NtrNeel) మూవీ.
NTR-Prashanth Neel movie is set to be postponed to next year.
- ఎన్టీఆర్ సినిమా వాయిదా పడే అవకాశం
- మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం కారణం
- త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన
NtrNeel: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకగా రూపొందుతున్న ప్రాజెక్ట్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం భారీ మేకింగ్ అని తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్(NtrNeel), అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.
దీనివల్ల ఈ భారీ యాక్షన్ డ్రామా ఏకంగా వచ్చే ఏడాది అంటే 2027 మే 7వ తేదీకి వాయిదా పడనున్నట్లు సమాచారం. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల మేకింగ్ లో జాప్యం అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే ఒక ప్రత్యేకమైన డార్క్ థీమ్, భారీ ఎలివేషన్లు ఉంటాయి. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక గ్లోబల్ స్థాయి అవుట్‌పుట్ ఇచ్చే క్రమంలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం అవసరమని చిత్ర బృందం భావిస్తోందట.
ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ వినగానే మాస్ ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో కథానాయికగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తోంది.
అయితే, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ డేట్ మారడం అభిమానులను నిరాశపరిచినా, వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని మే 7న విడుదల చేయడం వల్ల సినిమాకు చాలా ప్లస్ అయ్యే అంశమే అని చెప్పాలి. సెలవుల కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, ఒక అద్భుతమైన సినిమాను అందించడం కోసమే ఈ సమయం తీసుకుంటున్నారని ఫ్యాన్స్ సరిపెట్టుకోక తప్పదు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తరువాత ఎన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.
