ఓరినాయనో..! 48ఏళ్ల స్పెర్మ్ డోనర్ 165వ బిడ్డను స్వాగతించాడు.. మరో రెండేళ్లయితే..

స్పెర్మ్ డోనర్ అరి నాగెల్ కు ఈ ఏడాది ఆగస్టులో 49ఏళ్లు రానున్నాయి. తనకు 50ఏళ్ల వయస్సు వచ్చే వరకు స్పెర్మ్ డోనర్ గా కొనసాగుతానని, అప్పటి వరకు ..

Sperm Donor Ari Nagel : యుఎస్‌లో ”ది స్పెర్మినేటర్” అని కూడా పిలువబడే ఒక స్పెర్మ్ దాత ఇటీవల తన 165వ బిడ్డను ప్రపంచంలోకి స్వాగతించాడు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. బ్రూక్లిన్ కు చెందిన 48ఏళ్ల గణిత ప్రొఫెసర్ అరి నాగెల్ స్పెర్మ్ డోనర్. ఇప్పటి వరకు 165 మంది బిడ్డల జననానికి అతడి స్పెర్మ్ కారణమైంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అరి నాగెల్ కు ప్రపంచంలోని దాదాపు అన్ని ఖండాల్లో పిల్లలు ఉన్నారట. ప్రస్తుతం యూఎస్, కెనడా, ఆసియా, ఆఫ్రికా, యూరప్ లో 10మంది మహిళలు తన స్పెర్మ్ ద్వారా గర్భవతులుగా ఉన్నారు. వారిలో ఒకరు ఏక్షణంలోనైనా ప్రసవానికి సిద్ధంగా ఉండగా.. జులై, ఆగస్టు నెలలల్లో ఇద్దరు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారని నాగెల్ చెప్పాడు.

Also Read : పూరన్ పవర్ హిట్టింగ్‌.. టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ రికార్డ్ సమం, క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు

స్పెర్మ్ డోనర్ అరి నాగెల్ కు ఈ ఏడాది ఆగస్టులో 49ఏళ్లు రానున్నాయి. తనకు 50ఏళ్ల వయస్సు వచ్చే వరకు స్పెర్మ్ డోనర్ గా కొనసాగుతానని, అప్పటి వరకు 175 మంది పిల్లలకు తండ్రిగా మారతానని నాగెల్ చెప్పాడు. చాలా మంది పిల్లలను కలిగి ఉండటం వల్ల జీవితంలో ఆనందాన్ని పొందవచ్చునని అన్నాడు. నాగెల్ స్పెర్మ్ డొనేట్ చేసిన వారిలో ఎక్కువగా న్యూయార్క్ లో నివసిస్తున్నారు. న్యూయార్క్ లో 56 మంది , న్యూజెర్సీలో 20 మంది, కనెక్టికట్ లో 13 మంది జీవనం సాగిస్తున్నారు. తన స్పెర్మ్ ద్వారా జన్మించిన తన కుమారులు, కుమార్తెలలో చాలా మందిని తరచుగా కలుస్తుంటానని నాగెల్ చెప్పాడు.

Also Read : పెళ్లి చేసుకోబోతున్న విజయ్ మాల్యా కుమారుడు.. వధువు ఎవరో తెలుసా.. ఫొటోలు వైరల్

నాగెల్ తన స్పెర్మ్ డోనర్ జర్నీని ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. అప్పటి నుంచి అతను ప్రతివారం ఒకటి లేదా ఇద్దరు మహిళలకు స్పెర్మ్ నమూనాలను వివిధ పద్దతుల ద్వారా అందిస్తూ వచ్చాడు. అయితే, ప్రేమ విషయంలో అతనికి అదృష్టం లేదు. ఈ విషయంపై అతను మాట్లాడతూ.. నా దగ్గర డేటింగ్ యాప్ లు ఉన్నాయి. కానీ, తన స్పెర్మ్ ద్వారా బిడ్డలకు జన్మనించిన స్త్రీలు, ప్రస్తుతం 10మంది బిడ్డలకు జన్మనివ్వబోయే గర్భిణీ స్త్రీలలో తాను డేటింగ్ చేయాలనుకునే స్త్రీని గుర్తించడంలో విజయం సాధించలేక పోయాను. దీంతో నేనుకూడా చాలా విసిగిపోయానని అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు