పెళ్లి చేసుకోబోతున్న విజయ్ మాల్యా కుమారుడు.. వధువు ఎవరో తెలుసా.. ఫొటోలు వైరల్

సిద్దార్థ్ మాల్యా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు.

పెళ్లి చేసుకోబోతున్న విజయ్ మాల్యా కుమారుడు.. వధువు ఎవరో తెలుసా.. ఫొటోలు వైరల్

Vijay Mallya son Siddharth Wedding

Vijay Mallya son Siddharth Wedding : ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యా పేరు దేశ ప్రజలకు సుపరిచితమైన పేరు. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు తీసుకొని విదేశాలకు పారిపోయినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విదేశాల్లో మాల్యా కుటుంబం జీవనం సాగిస్తుంది. విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్ధ్ మాల్యా. అతను ఐపీఎల్ ప్రారంభ సీజన్లలో ఆర్సీబీ జట్టు ఆడే మ్యాచ్ లలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేతో పాల్గొని హల్ చల్ చేశాడు. అప్పట్లో దీపికా పదుకొనే, సిద్ధార్థ్ మాల్యా  ప్రేమలో ఉన్నట్లు వార్తలుసైతం వచ్చాయి. ఆ సమయంలో మీడియాలో సిద్ధార్థ్ ప్రముఖ వ్యక్తిగా మారాడు.. ఆ తరువాత కాలంలో జరిగిన పరిణామాలతో సిద్దార్థ్ కనిపించకుండా పోయాడు.

Also Read : ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

ప్రస్తుతం సిద్దార్థ్ మాల్యా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించాడు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. దీనికి వివాహ వారం ప్రారంభమైందని శీర్షిక ఇచ్చాడు. సిద్ధార్థ్ మాల్యా పెళ్లిచేసుకోబోయే యువతి పేరు జాస్మిన్. ఆమె మాజీ మోడల్. ఆమె సిద్ధార్థ్ కు చిన్నతనం నుంచి స్నేహితురాలు. గత ఏడాది నవంబర్ నెలలో సిద్ధార్థ్ మాల్యా జాస్మిన్ కు ప్రపోజ్ చేశాడు. అయితే, తాజాగా కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను సిద్ధార్థ్ మాల్యా తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో ఒకరినొకరు హత్తుకొని ఫ్లవర్ ఫ్రేమ్ లో పోజులిచ్చిన ఫొటోను షేర్ చేశాడు. రెండో చిత్రంలో తన ప్రియురాలి వేలికి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపుతున్న జాస్మిన్ తో కెమెరాకు ఫోజులిచ్చాడు సిద్ధార్థ్ మాల్యా.

Also Read : టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పిన కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూస‌న్‌.. వీడియో వైర‌ల్

సిద్దార్థ్ మాల్యా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో జన్మించాడు. లండన్, యూఏఈలో పెరిగాడు. సిద్ధార్థ్ మాల్యా మాజీ నటుడు, మోడల్. అంతేకాదు.. మానసిక ఆరోగ్యంపై అతడు రెండు పుస్తకాలు రాశాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya)

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya)