US Iran War: ఇరాన్‌తో యుుద్ధం.. అమెరికాకు బిగ్ షాక్..! తగ్గిపోతున్న క్షిపణి నిల్వలు.. ఇంకో 10 రోజులు..
అమెరికా ఇప్పటికే తొమహక్ ల్యాండ్ అటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థలో వినియోగించే ఎస్ఎం3 ఇంటర్ సెప్టర్ క్షిపణుల కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
Representative Image (Image Credit To Original Source)
- అమెరికా ఆయుధ నిల్వలపై పెంటగాన్ సంచలన రిపోర్ట్
- ఇరాన్ పై దాడులు మరో 10 రోజులకు పైగా కొనసాగితే మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోయే అవకాశం
- ఇప్పటికే తొమహక్ ల్యాండ్ అటాక్ మిస్సైళ్లు, ఇంటర్ సెప్టర్ క్షిపణుల కొరత
US Iran War: మిడిలీస్ట్ వార్ లో ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్న ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై అటాక్ చేస్తోంది. తాజాగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జరిపిన దాడుల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు చెందిన అధునాతన థాడ్ ఎయిర్ ఫేస్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కొన్నింటిని విడుదల చేశారు. ఈ దాడితో ఖతార్ లోని అల్ ఉదీద్ బేస్ లో ఉన్న రాడార్ ను కూడా ఇరాన్ దెబ్బతీసింది. అంతకుముందు దుబాయ్ లోని అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ చేసింది ఇరాన్.
ఇరాన్ తో యుద్ధం వేళ అమెరికాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. అమెరికా దగ్గర క్షిపణి నిల్వలు భారీగా తగ్గిపోతున్నట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ అధికారిక వర్గాలు కీలక హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ పై దాడులు మరో 10 రోజులకు పైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని పెంటగాన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అమెరికా ఇప్పటికే తొమహక్ ల్యాండ్ అటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థలో వినియోగించే ఎస్ఎం3 ఇంటర్ సెప్టర్ క్షిపణుల కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇరాన్ పై దాడులకు అమెరికా పెద్ద సంఖ్యలో మిస్సైళ్లు, ఇంటర్ సెప్టర్ లను వినియోగించే అవకాశం ఉందని పెంటగాన్ అధికారి తెలిపారు. దీంతో అమెరికా సైన్యం వద్ద ఉన్న ఆయుధ నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోతాయన్నారు.
మరోవైపు మరో రెండు మూడు వారాల పాటు వార్ కొనసాగే అవకాశం ఉంటుందని ట్రంప్ చెప్పిన వేళ ఈ పెంటగాన్ నివేదిక రిలీజ్ కావడం సంచలనంగా మారింది.
Also Read: విపరీతమైన కోరికలు, లైంగిక దాడులు, జూదం ఇంకా.. ఈ మందు వాడితే మటాషే? భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్..
