Ropinirole Side Effects: విపరీతమైన కోరికలు, లైంగిక దాడులు, జూదం ఇంకా.. ఈ మందు వాడితే మటాషే? భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్..
లేటు వయసులో విశృంఖల శృంగారం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
Ropinirole Side Effects Representative Image (Image Credit To Original Source)
- పార్కిన్సన్స్, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ సమస్యలకు ఈ మందునే డాక్టర్లు సూచిస్తారు
- రోపినైరోల్ వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్
- ఈ ఔషధం డోపమైన్ కార్యకలాపాలను పెంచడం ద్వారా పనిచేస్తుంది
Ropinirole Side Effects: గర్భధారణ సమయంలో వచ్చే రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ (RLS) అనే సమస్యకు వాడే మందుల వల్ల భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా? వ్యసనాలకు బానిసలు అవుతారా? సడన్ గా సెక్స్ కోరికలు పెరిగిపోతాయా? అలవాటు లేని వాళ్లు కూడా గ్యాంబ్లింగ్ (జూదం) ఆడతారా? హోమో సెక్సువల్ గా మారతారా? కొందరు వ్యక్తులకు ఎదురైన అనుభవాలు ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ మందులు వాడాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎమ్మా అనే మహిళ చెప్పిన ప్రకారం.. రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ అనే సమస్యకు వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తెలిసింది. అది తన జీవితాన్ని నాశనం చేసిందని ఆమె వాపోయింది. ఒక్క ఎమ్మానే కాదు.. బాధితులు చాలా మందే ఉన్నారు. ఆ ఔషధం.. జూదం, ఇతర వ్యసనాలను ఎలా ప్రేరేపించిందో వివరించి కన్నీటి పర్యంతం అయ్యారు.
సడెన్ గా పెరిగే సెక్స్ కోరికలు..
యూకేలోని జీఎస్ కే అనే ఫార్మా కంపెనీ రోపినైరోల్ అనే మందు తయారు చేస్తుంది. చాలామంది డాక్టర్లు.. పార్కిన్సన్స్, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ సమస్యలకు ఈ మందునే ప్రిస్క్రైబ్ చేస్తారు. అయితే, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా ఉన్నాయని తేలింది. సడన్ గా సెక్స్ కోరికలు పెరిగిపోవడం, అలవాటు లేని వాళ్లు కూడా గ్యాంబ్లింగ్ ఆడడం, హోమో సెక్సువల్ గా మారడం, ఎప్పుడూ భాగస్వామిని చీట్ చేయని వారు కూడా సడన్ గా వేశ్యల వద్దకు వెళ్లడం, భాగస్వామి మీద నిఘా పెట్టడం, కొత్త కొత్త వింత వింత కోరికలు కలగడం (గే కాకపోయినా గే లాగా డ్రెస్ వేసుకోవడం, మగవాళ్లు ఆడవారి డ్రెస్సులు వేసుకోవడం).. ఇలా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి.
ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి. ఎమ్మా అనే మహిళ సడన్ గా గ్యాంబ్లింగ్ కి అలవాటు పడి 30000 యూరోలు పోగొట్టుకుంది. మరో వ్యక్తి 6 లక్షల యూరోలు తన క్లైంట్స్ మనీ తీసేసుకుని వేశ్యలకి, పురాతన వస్తువుల కలెక్షన్స్ కి తగలెట్టాడు. 63 ఏళ్ల ఒక వ్యక్తి ఈ మందులు తీసుకున్న తర్వాత ఏడేళ్ల బాలిపై లైంగిక దాడి చేశాడు. ఒక వ్యక్తి తన నాలుగేళ్ల మనవరాలి మీద అఘాయిత్యం చేయబోయాడు. ఇలా లేటు వయసులో విశృంఖల శృంగారం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, రోపినైరోల్ తయారు చేసే కంపెనీ వాదన మరోలా ఉంది. తాము తయారు చేసే ఉత్పత్తుల్లో గ్లోబల్ స్టాండర్డ్స్ రూల్స్ ఫాలో అవుతామని కంపెనీ చెబుతోంది.
రోపినైరోల్.. ఈ ఔషధం డోపమైన్ కార్యకలాపాలను పెంచడం ద్వారా పనిచేస్తుంది. ఇది GSK తో పాటు, మరో ఇద్దరు తయారీదారులు కూడా అభివృద్ధి చేసిన ఔషధాల కుటుంబంలో భాగం. డోపమైన్ అనేది కదలికను నియంత్రించడంలో సహాయపడే ఒక రసాయనం. ఈ మెడిసిన్ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. భారీ అప్పులు చేయడం, నేరాలు చేయడం, ఆత్మహత్యలకు పాల్పడటం.. ఇలాంటి దుష్ప్రభావాలు ఎలా దారితీశాయో యూకే అంతటా ప్రజలు వివరించారు. అతిగా తినడం, నిర్లక్ష్యంగా పెట్టుబడులు పెట్టడం, స్వలింగ సంపర్క సంబంధాలు.. ఇలాంటి సైడ్ ఎఫెక్స్ట్ కూడా బయటపడ్డాయి. పార్కిన్సన్స్ రోగులలో దాదాపు ఆరుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన హఠాత్తు ప్రవర్తన ద్వారా ప్రభావితమయ్యారు.
బాధితుల్లో బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. పోలీస్ అధికారి, నర్సులు, డాక్టర్లు, బ్యాంక్ రిస్క్ డైరెక్టర్.. ఇలా పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు.
