ATA Convention : అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18వ ఆటా కన్వెన్షన్.. రికార్డ్ స్థాయిలో హాజరైన తెలుగువారు!

ATA Convention : తెలంగాణ మంత్రులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు విజయ్ దేవరకొండ, హీరో శ్రీకాంత్, ఆనంద్ దేవరకొండ తదిరులు హాజరయ్యారు.

ATA Convention 2024 : తెలుగువారి అతి పెద్ద పండుగ ఆటా 2024 వేడుక.. అమెరికాలో అట్టహాసంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో జూన్ 7 నుంచి జూన్ 9 వరకు అట్లాంటాలో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్‌కు 18 వేల మందికిపైగా తెలుగు వారు హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు సమావేశం విజయవంతమైంది.

ఈ వేడుకలకు తెలంగాణ మంత్రులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు నేహా షెట్టి, మెహ్రీన్, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి తదిరులు హాజరయ్యారు.

జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగువారి సేవలు అభినందనీయం : బ్రయాన్ కెంప్ 
జార్జియా అభివృద్ధికి తెలుగువారి సేవలను జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ కొనియాడారు. భారత్ తమ దేశానికి కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. ఆటా వేడుకలలో జార్జియా గవర్నర్ కూడా పాల్గొన్నారు.

యువత భవిష్యత్తుకు పెద్దపీట :
అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ.. యువత, భవిత, నవత అనే లక్ష్యాలతో ఈసారి ఆటా కన్వెన్షన్ నిర్వహించామన్నారు. వీటికి ఆటా అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ఇంత పెద్ద కన్వెన్షన్ చేయడం అంత తేలిక కాదన్నారు. అంతే ముందుకు తీసుకువెళ్తామని ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా చెప్పారు. అనితర సాధ్యం అనుకున్నది సాధ్యమైందని ప్రెసిడెంట్ మధు బొమ్మినేని తెలిపారు. చరిత్రను తిరగరాసిన ఈ కన్వెన్షన్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read Also : దటీజ్ చంద్రబాబు..! సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకున్న మేరునగధీరుడు

ఆటా నవల పోటీలు, త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్ విన్నూత్నంగా యువతను ఆకట్టుకున్నాయి. భద్రాద్రి శ్రీసీతారామ కళ్యాణం కూడా వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి వేలమంది హాజరు అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్ హనమంతరావు హాజరుఅయ్యారు. ఈసారి యూత్ కమిటీ సమావేశాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఏఐ సెమినార్, సెలబ్రిటీలతో క్యూ అండ్ ఏ, వివిధ విషయాలపై డిబేట్స్ వినోదాత్మకంగా నిర్వహించారు. ఉమెన్స్ ఫోరమ్‌లో మహిళా సాధికారత, గృహ హింస, వంటి అంశాలు కూడా చర్చించారు.

Conclusion of the 18th ATA Convention And Youth Conference in Atlanta Bang

బ్యూటీ పెజెంట్‌లో గెలిచినవారికి క్రౌన్
మెహ్రీన్, దేవరకొండ బ్రదర్స్‌తో ముఖాముఖీ కార్యక్రమాలను నిర్వహించారు. బిజినెస్ ఫోరమ్‌లో రాష్ట్ర మంత్రులు, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు, తెలంగాణ ఐటీ అడ్వైజర్ రవి తంగిరాల పాల్గొన్నారు. ఎప్పుడూ లేని విధంగా బిజినెస్ జరిగింది. టెక్నాలజీ, ట్రేడ్ ఫోరమ్‌లో ఏఐ వంటి అత్యాధునిక విషయాలపై చర్చ జరిగింది. ఎన్ఆర్‌ఐ కమిటీ ఇమ్మిగ్రేషన్, టాక్స్, ఎన్ఆర్ఐ ఇష్యూస్ సెమినార్లు, ఆంధ్రా, తెలంగాణా, అమెరికా పొలిటికల్ ఫోరంలలో వివిధ విషయాలపై చర్చ ఆసక్తిగా సాగింది. సాహిత్య ఫోరమ్‌లో కథా సాహిత్యం, సమకాలీన నవల, పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. అష్టావధానం రకరకాల చిక్కుముడులతో రసవత్తరంగా సాగింది. తనికెళ్ళ భరణి, గంగాధర శాస్త్రి ప్రవచనాలు అద్భుతంగా ఉన్నాయి. బ్యూటీ పెజెంట్ ఆకర్షణగా నిలిచింది. గెలిచిన వారికి దేవరకొండ బ్రదర్స్ కిరీటం ధరింపచేశారు.

Read Also : కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి, ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం

17 మందికి ఆటా అవార్డుల ప్రదానం
జీవిత భాగస్వాములను కోరుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆటా మ్యాట్రిమోనీకి అధిక సంఖ్యలో హాజరయ్యారు. మరోవైపు ప్రధాన కార్యక్రమంలో దాజీ శ్రీ కమలేష్ పటేల్ పాల్గొని ప్రేక్షకులకు సందేశమిచ్చారు. థమన్ మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తేడా లేకుండా సాగింది. వివిధ రంగాలలో రాణించిన 17 మందికి ఆటా అవార్డులు ప్రదానం చేశారు. హరి ప్రసాద్ రెడ్డి లింగాల, రామకృష్ణారెడ్డి ఆల, సాయినాథ్ బోయపల్లి, విజయ్ కుందూరు, మాజీ అధ్యక్షులు భువనేష్ బూజాల, రఘువీరారెడ్డిలకు అవార్డులు.. ఆటా లైఫ్‌టైమ్ సర్వీస్ అవార్డును డాక్టర్ రాజేశ్వర్ రావు టేక్మాల్‌కు అందజేశారు.

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సన్మానం చేశారు. ఆటా మహా సభలు అట్లాంటాలో జరగడం ఇది మూడోసారి. 2000, 2012లో అట్లాంటాలో ఆటా సమావేశాలు జరగగా ఇప్పుడు మళ్లీ పదేళ్ల తరవాత నిర్వహించారు. కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు