హమాస్ చెరలో బందీలుగాఉన్న వారిని ఇజ్రాయెల్ మిలిటరీ ఎలా రక్షించిందో చూశారా.. వీడియోలు వైరల్..

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ.. ఖచ్చితమైన సమాచారంతో రెస్క్యూ మిషన్ కోసం వారాలపాటు ప్రణాళిక రచించడం జరిగిందని, ఆ ప్రణాళిక ప్రకారం

Israel : హమాస్ చెరలో ఉన్న నలుగురు ఇజ్రాయెల్ పౌరులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రక్షించింది. నలుగురు బందీలైన నోవా ఆర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్ ను గత మూడురోజుల క్రితం ఇజ్రాయెల్ సైన్యం హమాస్ చెర నుంచి రక్షించింది. నోవో ఆర్గమణిని ఒక ప్రదేశం నుంచి రక్షించగా.. మిగిలిన ముగ్గురిని ఓ అపార్ట్ మెంట్ నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

Also Read : Israel-Iran Tensions : మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్..టెన్షన్.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు

ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. గాజాలో హమాస్ గ్రూపు ముగ్గురిని ఓ అపార్ట్ మెంట్ లోని గదిలో బందీలుగా ఉంచింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వారిని గుర్తించారు. ఓ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన దగ్గర నుంచి గదిలో బందీలుగా ఉన్న అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్ లను బయటకు తీసుకొచ్చేంత వరకు వీడియోలో రికార్డ్ అయ్యి ఉంది. మరో వీడియోలో హమాస్ చెర నుంచి రక్షించబడిన ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు హెలికాప్టర్ లో గాజా స్ట్రీప్ నుంచి టేకాప్ అవుతున్నారు.

Also Read : 245రోజుల తర్వాత హమాస్ చెర నుంచి బయటపడ్డ ఇజ్రాయెల్ యువతి.. వీడియోలు వైరల్

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ.. ఖచ్చితమైన సమాచారంతో రెస్క్యూ మిషన్ కోసం వారాలపాటు ప్రణాళిక రచించడం జరిగిందని, ఆ ప్రణాళిక ప్రకారం హమాస్ చెరలో బందీలుగాఉన్న మగ్గురిని సురక్షితంగా తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇదిలాఉంటే. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన ఘోరమైన దాడిలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందిని ఇజ్రాయెల్ పౌరులను హమాస్ బందీలుగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

 

 

ట్రెండింగ్ వార్తలు