అయ్యయ్యో.. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌కు ఏమైంది.. అటువైపు ఎందుకెళ్లాడు..? వీడియో వైరల్

బైడెన్ ఇలా ప్రవర్తించడం ఇదేంకొత్తకాదు.. గతంలోనూ ఆయన వ్యవహారశైలి చర్చకు దారితీసింది. వయసురిత్యా వచ్చే ఇబ్బందుల వల్ల ఆయన జ్ఞాపకశక్తిలో ..

American President Joe Biden : ఇటలీలోని అపూలియా ప్రాంతంలో జీ7 సదస్సు జరుగుతోంది. ఈ గ్రూప్ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. అయితే, జీ7కి వచ్చిన నేతలంతా గ్రూప్ ఫొటోకు ఫోజు ఇచ్చే సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యవహారశైలి ప్రతిఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పలు దేశాల నేతలంతా ఒకవైపు ఉంటే.. బైడెన్ మాత్రం వారి నుంచి కొద్దిదూరం వెళ్లి ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అయ్యయ్యో బైడెన్ కు ఏమైంది.. అటువైపు ఎందుకెళ్లాడు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Gold Rate : గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

ఇటలీలోని అపూలియా ప్రాంతంలో జరిగే జీ7 సదస్సుకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కావాల్సి ఉంది. గురువారం రాత్రే మోదీ ఇటలీలో అడుగుపెట్టారు. అయితే, జీ7కి వచ్చిన నేతలంతా గ్రూప్ ఫొటో దిగారు. ఫొటో దిగే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ మాత్రం వేరేవైపుకు వెళ్లి ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా సైగలు చేశారు. అయితే, బైడెన్ మాట్లాడే వైపు ఎవరూ లేరు. ఎంతకీ బైడెన్ రాకపోవటంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి బైడెన్ ను గ్రూప్ ఫొటో దిగేందుకు తీసుకొచ్చారు. ఈ వీడియోలో 81ఏళ్ల బైడెన్ వ్యవహారంశైలి గమనించిన వారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Modi Tadasana : ప్రధాని మోదీ ‘తాడాసనం’ వీడియో చూశారా.. దీని వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా?

బైడెన్ ఇలా ప్రవర్తించడం ఇదేంకొత్తకాదు.. గతంలోనూ ఆయన వ్యవహారశైలి చర్చకు దారితీసింది. వయసురిత్యా వచ్చే ఇబ్బందుల వల్ల ఆయన జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు గతంలో ఒక నివేదిక విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ నివేదికను బైడెన్ ఖండించారు. ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ బైడెన్ ప్రవర్తన ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి అస్త్రాలుగా మారుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు