Modi Tadasana : ప్రధాని మోదీ ‘తాడాసనం’ వీడియో చూశారా.. దీని వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా?

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ యోగాకు సంబంధించిన ‘తాడాసనం’ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

Modi Tadasana : ప్రధాని మోదీ ‘తాడాసనం’ వీడియో చూశారా.. దీని వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా?

PM Modi tadasana

Modi Tadasana Video : ఈనెల జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ యోగాకు సంబంధించిన ‘తాడాసనం’ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మోదీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్ ద్వారా.. తాడాసనం ఎలా చేయాలి.. దాని వల్ల కలిగే ఉపయోగాలను వీడియోలో వివరించారు. ఈ ఆసనం శరీరానికి ఎంతో మంచిది. శరీర భాగాల స్థితిని ఒక క్రమంలో ఉంచడంలో సహకరిస్తుందని ప్రధాని ఎక్స్ లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. పదేళ్ల క్రితం జూన్ 21ని యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐరాసలో భారత్ ప్రతిపాదించింది. దానికి అన్ని దేశాలు ముక్తకంఠంతో ఆమోదం తెలిపాయి. దీంతో ప్రతీయేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

Also Read : బీజేపీపై ఆగ్రహంగా ఉన్న ఆర్ఎస్ఎస్..? ఎందుకిలా.. కారణం ఏమిటి..

తాడాసనం ఎలా చేయాలంటే..?
తాడాసనం అనేది ఒక సాధారణ నిలబడి ఉండే భంగిమ.
ఇది సులభంగా అనిపించవచ్చు. కానీ నిజానికి చేయడం కొంచెం కష్టం.
మీ వెన్నెముకను నిటారుగా ఉంచి, రెండు కాళ్ల మధ్య ఒక అడుగు దూరం ఉంచి నిటారుగా నిలబడాలి.
శ్వాస పీల్చేటప్పుడు మీ చేతులను పైకి కదిలించాలి.
మీ మడమలను నెమ్మదిగా పైకిలేపి.. శరీరాన్ని కాలివేళ్లపై సమతుల్యం చేయాలి.
కొంత సమయంపాటు కాలివేళ్లపై నిలబడినప్పుడు చేతులను తలపై నుండి కిందికి తీసుకురావాలి.
తాడాసనం ద్వారా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందుతారు.

Also Read : అదృష్టవంతులు..! ఎమ్మెల్యే టికెట్ కోసమే కష్టపడిన నేతలకు ఏకంగా మంత్రి పదవులు

తాడాసనం చేయడం వల్ల మీ ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గవచ్చు. వెన్నెముకను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
తాడాసనం శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది.
శ్వాసకోశ, నాడీ, జీర్ణ వ్యవస్థలను సక్రమంగా ఉంచుతుంది.
తొడలు, మోకాళ్లు, చీలమండలతో సహా కాళ్లను బలపరుస్తుంది. వీటితోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలనుకూడా పొందొచ్చు.