అసెంబ్లీకి వచ్చేముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారో తెలుసా?

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు వెంకటపాలెం చేరుకున్నారు. వెంకటపాలెంలోని

Chandrababu naidu

AP Assembly Session 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులుపాటు జరిగే సమావేశాల్లో భాగంగా ఇవాళ ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో ఇవాళ తొలుత చంద్రబాబు నాయుడు, తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Also Read : యోగా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు వెంకటపాలెం చేరుకున్నారు. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టే ముందు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ మెట్లకు మొక్కి అడుగుపెట్టారు. అనంతరం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తన చాంబర్ లోకి చంద్రబాబు వెళ్లారు. అర్చకులు వేదమంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబును తన చాంబర్ లోని కుర్చీలో ఆశీనులయ్యారు. అర్చకులు చంద్రబాబును ఆశీర్వదించారు.

 

ట్రెండింగ్ వార్తలు