యోగా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది.. పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని మోదీ గుర్తు చేశారు.

యోగా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

PM Modi

International Yoga Day 2024 : ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతియేటా జూన్ 21న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంటాం. యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని జీవనశైలిలో భాగం చేసుకునేలా ప్రజలను ప్రేరేపించడం దీని ప్రధాన లక్ష్యం. కాగా శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖులు యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని దాల్ సరస్సు ఒడ్డున నిర్మించిన షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని యోగాసనాలు వేశారు.

Also Read : రాజధానిని పట్టాలెక్కించేందుకు చంద్రబాబు ప్రణాళికలు ఏంటి? 

మోదీ మాట్లాడుతూ.. విదేశాల్లోనూ యోగాచేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని, పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని మోదీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురువు గురించి మోదీ ప్రస్తావించారు. ఈ ఏడాది పద్మశ్రీతో ఆమెను సత్కరించినట్లు గుర్తు చేశారు. ఆమె ఎప్పుడూ భారత్ కు రాకపోయినప్పటికీ యోగాపై అవగాహన కల్పించడంకోసం తన జీవితాన్ని ధారపోశారని మోదీ కొనియాడారు. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమమైందని, దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారని మోదీ తెలిపారు.

Also Read : ఏపీలో టీడీపీ గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు భారతదేశానికి వస్తారు.. ఎందుకంటే వారు ప్రామాణికమైన యోగా నేర్చుకోవాలి. ప్రస్తుతం జర్మనీలో 1.5కోట్ల మంది యోగా ట్రైనర్లు ఉన్నారని మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచం కొత్త యోగా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడాన్ని చూస్తోంది. యోగా టూరిజంలో రిషికేశ్ నుంచి కేరళ వరకు కొత్త ట్రెండ్ కనిపిస్తోందని మోదీ అన్నారు. విమానాశ్రయాల నుంచి హోటళ్ల వరకు యోగాకోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. యోగా సంబంధిత దుస్తులు, పరికరాలు మార్కెట్లలో పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తమ ఫిట్ నెస్ కోసం వ్యక్తిగత యోగా శిక్షకులను కూడా నియమించుకుంటున్నారని మోదీ తెలిపారు. ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం యోగా, మైండ్‌ఫుల్‌నెస్ ప్రోగ్రామ్‌లను కూడా ప్రారంభిస్తున్నాయి. ఇది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని మోదీ అన్నారు.