Lakshmi Manchu Says Father Mohan Babu Is Against Her Being An Actor
సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మంచు లక్ష్మి. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు, షోలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌ను వదిలి ముంబైలో నివసిస్తోంది. తాను ముంబై రావడానికి గల కారణం ఏంటి..? తన కుటుంబం వల్ల పడిన ఇబ్బందులు ఏమిటి అనే విషయాలను ఆమె ప్రీ ప్రెస్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తాను హైదరాబాద్ వదిలి ముంబై వచ్చేందుకు తన కుటంబం ఓ అడ్డంకిలా మారిందని మంచు లక్ష్మి తెలిపింది. నన్ను ముంబై పంపించాలంటే ఇంట్లో వాళ్లు సంకోచించారు. ముంబైకి వచ్చిన కొత్తలో నా బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఉండేదాన్ని అని ఆమె చెప్పింది.
రకుల్ ముంబై వచ్చేయ్ అని తరచుగా చెప్పేదని, ఇక రానా సైతం ఎప్పటికీ హైదరాబాద్‌లోనే ఉండిపోకూడదని చెప్పాడు. దీంతో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ముంబై వచ్చినట్లు మంచు లక్ష్మి చెప్పింది.
Nindha : వరుణ్ సందేశ్ ‘నింద’ మూవీ రివ్యూ.. ఒక నిర్దోషిని ఎలా కాపాడారు?
పితృస్వామ్యానికి బాధితురాలినే..
తాను పితృస్వామ బాధితురాలిగా మంచు లక్ష్మి చెప్పుకుంది. దక్షిణాదిలో తమ కూతుళ్లు, అక్కలు, చెల్లెళ్లను సినిమాల్లో నటింపజేయడానికి ఇష్టపడరని, తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందని ఆమె చెప్పడం గమనార్హం. తాను నటి కావడం తన తండ్రికి ఇష్టం లేదంది. తన ఇద్దరు బ్రదర్స్‌కి సులభంగా దక్కినవి తాను ఎంతో కష్టపడి సాధించుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఇది దక్షిణాదిలోనే కాదు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉంది అని తెలిపింది. ఇక తనను ప్రకాశ్ కోవెలమూడి ఇండస్ట్రీకి పరిచయం చేశారంది.