Bengal Panchayat Polls: కౌంటింగ్ రోజు కూడా కొట్లాటే.. అల్లర్లతో అతలాకుతలం అవుతోన్న బెంగాల్

పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలంటే అల్లర్లు.. అల్లర్లంటే ఎన్నికలు అన్నట్లు ఉంటుంది పరిస్థితి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రారంభమైన రోజు నుంచే అధికార, విపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. కత్తులు, బాంబులు కూడా ఈ అల్లర్లలో ప్రధాన పాత్రే వహిస్తున్నాయి. ఇక పోలింగ్ జరిగిన రోజైతే మరీ దారుణమైన అల్లర్లు చెలరేగాయి. కాగా ఈ అల్లర్లలో ఆ ఒక్క రోజే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 40 మంది చనిపోయారు.

Bengal Panchayat Polls: బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను మరోసారి చావు దెబ్బకొట్టిన టీఎంసీ!

ఇక తాజాగా ఆ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో కూడా రాష్ట్రంలో హింస ఏమాత్రం తగ్గడం లేదు. అధికార పార్టీతో విపక్ష పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగుతున్నారు. కర్రలు, రాళ్లతో కొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఈ హింసలో పదుల సంక్యలో వివిధ పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. రాష్ట్ర పోలీసులు సహా కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

Ketireddy Peddareddy : 2024లో జేసీ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టి చూపిస్తా : కేతిరెడ్డి పెద్దారెడ్డి

పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది. ఈ ఎన్నికల్లో 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేశారు. 61,636 బూత్‌లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు అంచెల పంచాయతీ వ్యవస్థలో 73,887 స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి.

TSRTC: భక్తులకు శుభవార్త.. అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులు

పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం జరిగింది. పోలింగ్ బూత్‌ల ఆక్రమణ, బ్యాలట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, హత్యలు, దహనాలు, కాల్పులు వంటి సంఘటనలు జరిగాయి. దీంతో బీజేపీ సహా ఇతర పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ 696 బూత్‌లలో పోలింగ్‌ను రద్దు చేసి, సోమవారం రీపోలింగ్ నిర్వహించింది. ముర్షీదాబాద్ జిల్లాలో 175, మాల్డాలో 112, నాడియా జిల్లాలో 89, ఉత్తర 24 పరగణాల జిల్లాలో 46, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 36 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు