Vodafone Prepaid Plans : ప్రముఖ దేశీయ అదిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone idea) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తమ కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ డేటాతో పాటు అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. ప్రస్తుత రోజుల్లో టెలికం కంపెనీలు తమ ప్రత్యర్థులకు పోటీగా కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. అందులో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel)లతో 5G రేసులో ముందంజలో దూసుకెళ్తున్నాయి. కానీ, వోడాఫోన్ ఐడియా (Vi) కంపెనీ మాత్రం 5G రేసులో వెనుకబడి ఉంది.
తద్వారా Vi వినియోగదారు బేస్‌లో భారీ క్షీణతను ఎదుర్కొంటోంది. పడిపోతున్న కస్టమర్ల బేస్ కంట్రోల్ చేసేందుకు సబ్ స్ర్కైబర్లను తిరిగి ఆకర్షించేందుకు టెల్కో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. అలాగే తగ్గిన టారిఫ్‌లను కూడా సవరిస్తోంది. Vi కొన్ని రోజుల క్రితమే అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు టెల్కో రూ. 2,999 ధర ట్యాగ్‌తో అన్లిమిటెడ్ బెనిఫిట్స్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
TelecomTalk నివేదిక ప్రకారం.. Vi వార్షిక వ్యాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అన్లిమిటెడ్ ప్లాన్ల సెక్షన్ కింద రూ. 2,999కి బెనిఫిట్స్ అందిస్తోంది. రూ. 2,999 ప్లాన్ 850 GB బల్క్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 365కి యాడ్ చేసిన Vi బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. Vi రూ 2,999 ప్లాన్లపై అందించే అదనపు బెనిఫిట్స్ ఏంటో ఓసారి నిశితంగా పరిశీలిద్దాం.
వోడాఫోన్ ఐడియా (Vi) రూ. 2,999 ప్లాన్ :
Vi ద్వారా కొత్త అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వార్షిక వ్యాలిడిటీతో 865GB బల్క్ డేటా, లోకల్ లేదా STD కాలింగ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్లు, రోజుకు 100 SMSలను అందిస్తోంది. 850 GB డేటా కోటా వినియోగం తర్వాత, టెలికాం MBకి 50 పైసలు వసూలు చేస్తుంది. 100 SMS లిమిట్ ముగిసిన తర్వాత వినియోగదారులు స్థానిక రూ. 1.5 STD SMS కోసం రూ. 1 ఛార్జ్ చేస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 28 రోజులకు రూ.230 ఖర్చవుతుంది. దాదాపు 2.33GB రోజువారీ డేటాను అందిస్తుంది.
Read Also : Vodafone Idea Users : అతి త్వరలో వోడాఫోన్ ఐడియా యూజర్లకు 5G సర్వీసులు.. గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా
రూ. 2,999 ప్లాన్ అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్లిమిటెడ్ డేటా, Vi సినిమాలు, టీవీకి యాక్సెస్ అందిస్తోంది. ప్లాన్ బల్క్ డేటాను అందిస్తున్నందున వీకెండ్ డేటా రోల్ఓవర్, ప్రతి నెలా 2GB వరకు ఉచిత డేటా సహా Vi Hero బెనిఫిట్స్‌ను Vi తొలగించింది. Vi Hero బెనిఫిట్స్ అందించే అన్లిమిటెడ్ బెనిఫిట్స్, Vi ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే మీరు రూ. 2899, రూ. 3099 అన్లిమిటెడ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలను ఓసారి పరిశీలించండి.
Vi రూ 2899 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్‌తో వచ్చింది. రోజుకు 100 SMS, 1.5 GB రోజువారీ డేటాను 547.5GB మొత్తం డేటాతో 365 రోజుల పాటు అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ సహా అన్ని నైట్ డేటా బెనిఫిట్స్, వారాంతపు డేటా, డేటా డిలైట్లు, Vi సినిమాలు & టీవీకి యాక్సెస్ పొందవచ్చు.
Vi రూ 3099 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తోంది. రోజుకు 100 SMS, 2GB రోజువారీ డేటాతో పాటు 365 రోజుల వార్షిక వ్యాలిడిటీని కూడా అందిస్తుంది. ఇతర బెనిఫిట్స్ సహా బింగే ఆల్ నైట్ బెనిఫిట్స్, వారాంతపు డేటాను అందిస్తుంది. డేటా డిలైట్స్, Vi సినిమాలు & టీవీకి యాక్సెస్ పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..