Karnataka Polls: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? సర్వేలో ఆసక్తికరమైన సమాధానాలు

ఇక రాష్ట్రంలో రాజకీయ నేతల ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అధికార పక్ష నేతలకు ఎంత బలం ఉంటుందో, విపక్ష నేతలకు కూడా అంతే బలం ఉంటుంది. అదే కర్ణాటక ప్రత్యేకత. విచిత్రం ఏంటంటే.. ప్రజలు కూడా అదే విధంగా తీర్పు చెబుతుంటారు. ఎప్పుడూ ఒకే పక్షానికి పూర్తి అధికారం ఇవ్వరు. దీంతో ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వాలు కొనసాగవు

Karnataka Polls: మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అనంతరం మూడవ రోజు అనగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. కాగా ఈరోజు నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. దేశంలో రాజకీయంగా అత్యంత చర్చనీయాంశమైన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఈ రాష్ట్రంపై రాజకీయ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ చర్చలో ఉంటుంది.

Karnataka polls: ప్రజల్ని బిచ్చగాళ్లు అనుకుంటున్నారు.. కాంగ్రెస్ నేత నోట్లు చల్లడంపై సీఎం బొమ్మై

ఇక రాష్ట్రంలో రాజకీయ నేతల ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అధికార పక్ష నేతలకు ఎంత బలం ఉంటుందో, విపక్ష నేతలకు కూడా అంతే బలం ఉంటుంది. అదే కర్ణాటక ప్రత్యేకత. విచిత్రం ఏంటంటే.. ప్రజలు కూడా అదే విధంగా తీర్పు చెబుతుంటారు. ఎప్పుడూ ఒకే పక్షానికి పూర్తి అధికారం ఇవ్వరు. దీంతో ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వాలు కొనసాగవు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే పూర్తి స్థాయి ప్రభుత్వాలు కొనసాగాయి. అందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఒకటి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా నాలుగు సార్లు ప్రభుత్వం మారింది.

Arvind Kejriwal: మోదీ ఓడగానే దేశంలో అవినీతే ఉండదట.. కేజ్రీవాల్ చెప్పిన లాజిక్ ఏంటంటే..?

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ఉన్నట్లు సర్వేలన్నీ చెబుతున్నాయి. సింగిల్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని స్పష్టంగా చెప్పనప్పటికీ, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఒపీనియన్ పోల్స్ అంటున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీలోని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలకు కూడా మంచి ఆదరణే ఉంది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక జేడీయూ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా అగ్రనేతల్లో ఒకరు. దీంతో ఈ నలుగురి మధ్యే సీఎం కుర్చీలాట సాగుతుందని అంటున్నారు.

PM Modi: ప్రజాస్వామ్యం కేవలం నిర్మాణం కాదు. అది దేశ ఆత్మ.. సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో పీఎం మోదీ

అయితే ఎన్నికలకు ముందే సీ-ఓటర్ సర్వే ఒక సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని సర్వేలో ప్రశ్నించారు. కాగా, అచ్చం ఎన్నికల లాంటి ఫలితాలే ఈ సర్వేలో వచ్చాయి. సగం మంది ప్రజలు ఒక నాయకుడిని సీఎంగా ఎన్నుకోలేదు. ప్రధానంగా బొమ్మై, సిద్ధరామయ్య, కుమారస్వామిలను ముఖ్యంత్రులు అయితే బాగుంటుందని తీర్పు చెప్పారు. ఎన్నో అంచనాల మధ్య ఉన్న కాంగ్రెస్ అధినేత డీకే శివకుమార్‭కు ఈ సర్వేలో కనీస మద్దతు లభించకపోవడం గమనార్హం.

Karnataka Polls: కర్ణాటకలో ఏప్రిల్ 5 నుంచి రాహుల్ గాంధీ ప్రచారం.. ఒంటరిగానే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా

ఇక ఈ సర్వేలో మాజీ సిద్ధరామయ్యే టాప్‭లో నిలిచారు. అంతే కాదు, సుమారు సగానికి దగ్గరగా ఓట్లు సంపాదించారు. సీ-ఓటర్ సర్వేలో 39 శాతం మంది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని సమాధానం చెప్పారు. ఇక తర్వాతి స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మై ఉన్నారు. ఆయనకు 31 శాతం ఓట్లు వచ్చాయి. ఇక మూడవ స్థానంలో కుమారస్వామికి 21 శాతం ఓట్లు వచ్చాయి. డీకేకు కేవలం 3 శాతమే ఓట్లు వచ్చాయి. ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు