Filmy Facts : బాహుబలి2లో ప్రభాస్ డ్యామ్ ఎందుకు పగలకొట్టాడో తెలుసా..?

వరద నీళ్లే ఎందుకు రావాలి.. బాంబులుపెట్టో.. బాణాలో, శూలాలో గుచ్చి చంపొచ్చుగా అనే డౌట్ రావొచ్చు. అక్కడే ఉంది లాజిక్కు.

Baahubali Prabhas : సినిమాలంటే అందరికీ ఓ క్రేజ్. వినోదానికి రూపం లేదు. అది కామెడీ కావచ్చు. యాక్షన్ కావచ్చు. డ్యాన్స్ కావచ్చు. హారర్ కావచ్చు. అల్టిమేట్ గా… ఎంటర్ టైన్ చేస్తే అది సక్సెస్ అయినట్టే. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తే మూవీ హిట్టైనట్టే. ఈ జానర్ లో డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు పూర్తిచేసేసిన ఘనత సాధించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.

యాక్షన్ సీన్స్ తో… ఆడియన్స్ నరాలు తెంపి అంటించడం….. సీటు అంచున కూర్చోబెట్టి.. కుదురుగా కూర్చోబెట్టడం రాజమౌళికి కెమెరాతో పెట్టిన విద్య. ఫైట్లు… ఆ సీన్లకు ముందు ఎమోషన్ రైజ్ చేసి.. సీన్ ను పీక్స్ కు చేర్చడంలో సిద్ధహస్తుడు రాజమౌళి.

Seetimaar : నా ఫ్రెండ్ సినిమా బ్లాక్‌బస్టర్..

రాజమౌళి సినిమా అంటే అందులో ఏ టాప్ హీరో ఉన్నా.. రాజమౌళే కనిపిస్తాడు. అదీ ఆయన లెవెల్. RRR సినిమా పేరెత్తగానే… జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలైనప్పటికీ… వాళ్లిద్దరి కన్నా… బాహుబలి విగ్రహమంత రేంజ్ లో ఆడియన్స్ మైండ్ లో ఓ పక్కన కదులుతుంటుంది రాజమౌళి బొమ్మ.

రాజమౌళి సీన్లలో గ్రామర్
రాజమౌళి తీసే సీన్స్ కు గ్రామర్ ఉంటుంది. చాలా సినిమాల్లో విలన్ల సంహారం… సరికొత్త ఆయుధాల వాడకానికి.. ఓ లెక్కఉంటుంది. అలాంటి వాటిల్లో సరదాగా ఓ సీన్ గురించి మాట్లాడుకుందాం.

Baahubali Dam Fight Scene Arrow Fight

బాహుబలి2(Baahubali 2) మూవీలో… ప్రి-ఇంటర్వెల్ కు ముందు వచ్చే డ్యామ్ ఫైట్… ఆ సినిమా సిరీస్ లోనే ఓ బిగ్గెస్ట్ హైలైట్. ఆ ఫైట్ లో… కుంతల దేశం మీదకు దండెత్తి వచ్చే పిండారీల సైన్యాన్ని మట్టికరిపిస్తాడు మహా వీరుడైన ప్రభాస్(అమరేంద్ర బాహుబలి). ఐతే… వేలాదిగా వచ్చి.. అనుష్క(దేవసేన) రాజ్యాన్ని చుట్టుముట్టి ఆక్రమించిన ఆ సైన్యాన్ని సంహరించాలంటే.. ఏ సునామీలాంటిదో… ఏ వరదలాంటిదో రావాలనుకున్నాడు డైరెక్టర్. అక్కడో డ్యామ్ ఉంటే… ఆ డ్యామ్ తెంపితే వచ్చే నీళ్లలో కొట్టుకుపోతారు శత్రు సైనికులు అనేది ఐడియా. అదే వర్కవుటయ్యింది. వరద వచ్చింది. నీళ్లలో కొట్టుకుపోయారు పిండారీలు. బానే ఉంది. మాంఛి.. కిక్కు వచ్చింది. మరి… వరద నీళ్లే ఎందుకు రావాలి.. బాంబులుపెట్టో.. బాణాలో, శూలాలో గుచ్చి చంపొచ్చుగా అనే డౌట్ రావొచ్చు. అక్కడే ఉంది లాజిక్కు.

ఇదే ఆ మైండ్ బ్లోయింగ్ లాజిక్
పిండారీలను నీళ్లలోనే ముంచి చంపాలనుకోవడానికి… ఓ సీన్ లింక్ చూపించాడు రాజమౌళి. రాజమాత శివగామి ఆదేశాలతో… దేశాటనకు బయల్దేరిన బాహుబలి, కట్టప్పలు ఓ చెరువు దగ్గర నీళ్లు తాగాలనుకుంటారు. అక్కడ వంగి నీళ్లు తాగుతుంటే… డెడ్ బాడీలు నీళ్లలో తేలుతుంటాయి. “ఇది పిండారీలు చేసిన మారణకాండ. ధాన్యం, డబ్బులు దోచుకుని… జనాలందరినీ జల సమాధి చేయడం పిండారీలకు అలవాటు” అని కట్టప్ప బాహుబలికి చెప్తాడు. అలా… జనాన్ని నీళ్లలో ముంచి చంపే పిండారీలను… వాళ్ల స్టైల్లోనే నీళ్లలో ముంచి చంపేశాడు బాహుబలి. డ్యామ్ గేట్లు విరగ్గొట్టి.. ఆ వరదనీళ్లలో కొట్టుకుపోయి చనిపోవడం వెనుక అసలు లాజిక్ ఇదీ. రివేంజ్ ను కూడా ఓ లెవెల్ లో చూపించాడన్నమాట. నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఇలాంటివి మరిన్ని తెల్సుకుందాం.

Gopichand : ఫ్రెండ్ సినిమా కోసం ప్రభాస్..

ట్రెండింగ్ వార్తలు