Yogurt Face Pack : వర్షకాలంలో చర్మాన్ని తాజాగా ఉంచే పెరుగు ఫేస్ ప్యాక్!

వర్షాకాలం గాలిలో ఎక్కువగా ఉండే తేమ చర్మం మీద ప్రభావం చూపుతుంది. దాంతో చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే పెరుగు ఫేస్‌ప్యాక్‌తో చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Yogurt Face Pack : చర్మ సంరక్షణలో పెరుగు అద్భుతమైన ఎంపిక. పెరుగులోని ప్రోబయోటిక్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. చర్మానికి పెరుగు యొక్క ప్రయోజనాల గురించి చెప్పాలంటే పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ టైరోసినేస్ సంశ్లేషణను నిరోధిస్తుంది. టైరోసినేస్ అనేది మెలనిన్ ఉత్పత్తికి బాధ్యత వహించే ఎంజైమ్, ఇది మీ చర్మపు రంగును డార్క్‌గా మార్చే పదార్థం. ఇలా పెరుగు చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, చర్మ కణాల టర్నోవర్ రేటును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

వర్షాకాలం గాలిలో ఎక్కువగా ఉండే తేమ చర్మం మీద ప్రభావం చూపుతుంది. దాంతో చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే పెరుగు ఫేస్‌ప్యాక్‌తో చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగులో జింక్ ఉంటుంది. జింక్ మొటిమలు చికిత్సకు సహాయపడుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. పెరుగులోని జింక్ మచ్చలు, నల్లటి వలయాలను తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

పెరుగుతో ఫేస్‌ప్యాక్స్‌:

రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, మాష్‌ చేసిన మగ్గిన అరటిపండు, రెండు టీ స్పూన్ల రోజ్‌వాటర్‌ను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖం, మెడ చుట్టూ రాసుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరచుగా ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.

ఒక కప్పులో రెండు లేదా మూడు స్పూన్ల పుల్లని పెరుగు తీసుకొని బాగా గిలకొట్టాలి. ఇప్పుడు పెరుగును ముఖం, మెడ చుట్టూరా మర్దన చేస్తున్నట్టు రాసుకోవాలి. పుల్లని పెరుగు చర్మానికి పోషణనిస్త్తుంది. మలినాలు, మృతకణాలను తొలగించి చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది.

పెరుగు, తేనె, నిమ్మరసం తో ఫేస్ ప్యాక్ ను తయారు చేయవచ్చు. రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ నిమ్మరసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ ప్యాక్‌లా రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలాచేస్తే ముఖం మీది దుమ్ము, మలినాలు తొలగి చర్మం తాజాగా, ఆరోగ్యంగా మారుతుంది.

ట్రెండింగ్ వార్తలు