Jamun Fruit : నోరు , చిగుళ్ల సమస్యలను పొగొట్టే నేరేడు పండ్లు !

నేరేడు పండ్లను తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.

Jamun Fruit : నేరేడు తినడం వలన ఆరోగ్యానికి మంచిది. నేరేడు పండ్లలో క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, విటమిన్‌ సి, విటమిన్‌ బి కాంప్లెక్స్‌లోని రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్‌ బి6 వంటి వాటితోపాటు కెరోటిన్, ఫోలిక్‌యాసిడ్‌ సమృద్ధిగా ఉంటాయి. నేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతాలు దృఢంగా మారుతాయి, చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన పోగొట్టటంలో తోడ్పడతాయి. పండ్లను తింటే కిడ్నీలు శుభ్రమవుతాయి. కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. మూత్రాశాయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

నేరేడు పండ్లను తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. అసిడిటీ, గ్యాస్‌ తగ్గుతాయి. నేరేడు పండ్లలో ఉండే విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నేరేడులోని పాలీఫీనాల్‌ వంటి ఫైటోకెమికల్స్‌ క్యాన్సర్లతో పోరాడతాయి.

వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలకు అడ్డుకట్ట వేసి, దీర్ఘకాలం యౌవనంగా కనిపించేలా చేస్తాయి. మహిళల్లో సంతానలేమి సమస్యలు తొలగిపోతాయి. నేరేడు పళ్లలో విటమిన్‌ బి, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. నేరడు విత్తనాలు ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు