Summer Precautions : మండుతున్న ఎండలను లైట్ తీసుకుంటున్నారా.? తస్మాత్ జాగ్రత్త..!

ఎండతీవ్రతతో తెలియకుండానే చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇల్లు దాటి బయటికి వెళ్లనివారు కూడా వడదెబ్బ తగిలి నీరసించిపోతున్నారు.

Summer Precautions : ఇంట్లో ఉండలేం..అలా అని బయట తిరగలేం. అన్నట్లుగా ఉన్నాయి ఎండలు. ఇంట్లో ఉంటే ఉక్కపోతే..బయటికి వెళ్తే మాడు పగిలే ఎండ. ఉదయం 8 అయితే చాలు ఇల్లు దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈసారి ఎండవేడిమి అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండతీవ్రతతో తెలియకుండానే చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇల్లు దాటి బయటికి వెళ్లనివారు కూడా వడదెబ్బ తగిలి నీరసించిపోతున్నారు. ఎండల వేడి పెరగడంతో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ జనాలకు పలు సూచనలు చేసింది.

Read Also : Stress Physical Health : ఒత్తిడితో హైబీపీ, అజీర్ణం సమస్యలు.. మీ శారీరక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందంటే?

తలనొప్పి వచ్చినా పట్టించుకోవడం లేదా.? :
నీళ్లు సరిగ్గా తీసుకోకపోయినా..ఎండలో తిరిగినా.. బాడీ డీ హైడ్రేట్‌ అయ్యి తలనొప్పి  వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒకటి రెండ్రోజులకు మించి తలనొప్పి ఉంటే కేర్‌ తీసుకోవాలని డాక్టర్‌కు చూపించుకోవాలంటున్నారు నిపుణులు. టైమ్ టు టైమ్‌ సరైన వాటర్ తీసుకోకపోతే బాడీ డీహైడ్రేట్ అవతుందని హెచ్చరిస్తున్నారు. ఎండకాలంలో శరీరానికి సరిపడా నీరు ఇవ్వకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు.

జూన్‌ వరకు సూర్యప్రతాపం ఇలానే ఉండే అవకాశం ఉందంటోంది IMD. మే, జూన్ రెండు నెలలు ఎండలు మండిపోయే అవకాశం ఉండటంతో..చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. తగినంత నీటిని తీసుకుంటూ, బాడీ టెంపరేటర్స్‌ను చెక్‌ చేసుకుంటూ కేర్‌ ఫుల్‌గా ఉండటం బెటర్‌. లేకపోతే వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలు చాలా ప్రమాదకరమంటున్నారు డాక్టర్లు. సమ్మర్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే రోగాలు ధీర్ఘకాలికంగా ఉండిపోతాయని హెచ్చరిస్తున్నారు.

ఎండలు ఎక్కువైనప్పుడు బాడీ టెంపరేచర్‌ కూడా పెరుగుతుంది. దాంతో మనకు చెమటలు వచ్చి శరీరం నుంచి వాటర్ వెళ్లిపోతుంది. అందుకే సమ్మర్‌లో బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఎప్పటికప్పుడు వాటర్ తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే బాడీలో వాటర్‌ లెవల్స్ పడిపోయి డీహైడ్రేషన్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డైజెషన్ ప్రాబ్లమ్స్, బీపీ పెరగడం, కిడ్నీలో స్టోన్స్, ర్యాషెస్‌ వచ్చే చాన్స్ ఉంటుంది.

ఎప్పటికప్పుడు వాటర్ తాగడం మర్చిపోతున్నారా.? :
ఎప్పటికప్పుడు సరైన మోతాదులో నీటిని తాగడంతో పాటు ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఎండలో తిరగొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. ఒకవేళ ఎండలో తిరగాల్సి వస్తే తప్పకుండా అంబరిల్లా పట్టుకుని వెళ్లాలని..చెప్పులు లేకుండా నడువొద్దని సూచిస్తున్నారు. ఎండలో నుంచి రాగానే కూల్‌ వాటర్ తాగొద్దని..అలాగే కూల్ వాటర్‌తో స్నానం చేయడం కూడా అనారోగ్యానికి దారి తీస్తుందని చెబుతున్నారు.

ఇక సమ్మర్‌లో బాడీకి ఓవర్ ఎక్సర్‌సైజ్‌ కూడా మంచిది కాదనేది డాక్టర్ల సూచన. తగిన విరామంతో సరిపడినంత వాటర్‌ తీసుకుంటూ వ్యాయామం చేయడం బెటర్. ఈ సమ్మర్‌లో అతి చల్లటి నీరు, కూల్ డ్రింక్స్ ఏది తీసుకున్నా ఇబ్బందే అంటున్నారు నిపుణులు. బాగా చల్లగా ఉన్నవాటిని తాగితే గొంతునొప్పి, జలుబు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.

బాడీ టెంపరేచర్స్ పడిపోకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు చల్లటి ప్రదేశాల్లో ఉండాలి. ఎక్కువ లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. బాడీకి చలువ చేసే మజ్జిగలాంటి పదార్థాలను తీసుకుంటే మంచిది. వాటర్ మిలన్, కీర, క్యారెట్ వంటి వాటర్ కంటెంట్ ఉన్నవాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. లెమన్ వాటర్, కొబ్బరినీళ్లు బాడీ డీహైట్రేట్ కాకుండా కాపాడుతాయని అంటున్నారు.

సమ్మర్‌లో చాయ్, కాఫీలు అవైడ్ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు.  సాప్ట్ డ్రింక్‌లు కూడా తాగొద్దని.. ఆయిల్ ఫుడ్స్‌కు కూడా ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అంటున్నారు. ఈ సమ్మర్‌ లో బాడీ డైజేషన్ పవర్‌ తక్కువగా ఉంటుందని.. అందుకే లైట్ ఫుడ్ తినాలని సూచిస్తున్నారు. ఇక వృద్ధులు, పిల్లలు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్ల సూచన. రోజుల తరబడి ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన ఆహార పదార్థాలు కాకుండా.. ఫ్రెష్‌ ఫుడ్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

ట్రెండింగ్ వార్తలు