AstraZeneca Covid Vaccine : కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ఆస్ట్రాజెనెకా కీలకం నిర్ణయం.. టీకా వెనక్కి!

AstraZeneca Covid Vaccine : ఆస్ట్రాజెనెకా.. తమ వ్యాక్సిన్‌తో చాలా అరుదుగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే టీకాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.

AstraZeneca Covid Vaccine : ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా కీలక నిర్ణయం తీసుకుంది. తాము డెవలప్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఉత్పత్తిని నిలిపివేయడంతో పాటు.. డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేసినట్లు తెలిపింది ఆస్ట్రాజెనెకా. తమ వ్యాక్సిన్‌ వెనక్కి తీసుకోవడానికి డిమాండ్‌ తగ్గడమే కారణమని చెప్తోంది.

Read Also : IT Employees Health Issues : డేంజర్‌లో టెకీలు.. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం

మార్కెట్‌లో అప్‌డేటెడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో తమ టీకాలకు డిమాండ్ తగ్గిందని చెప్తోంది ఆస్ట్రాజెనెకా. అయితే ఈ సంస్థ ఆక్స్ ఫర్డ్‌ యూనివర్సిటీతో కలసి డెవలప్ చేసిన కోవిషీల్డ్ టీకాపై ప్రపంచవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో కేసులు ఉన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుంటే తమకు అరుదైన వ్యాధులు వచ్చాయంటూ పలువురు  పిటిషన్లు వేశారు. యూకేలో 81 మంది ప్రాణాలు కోల్పోయారని.. వారి కుటుంబసభ్యులు వందల కోట్లు డిమాండ్ చేస్తూ కేసులు వేశారు.

కోర్టు కేసులు, పబ్లిక్ నుంచి వస్తున్న ఒత్తిడితో.. కొన్నాళ్ల క్రితమే వాస్తవాన్ని ఒప్పుకుంది ఆస్ట్రాజెనెకా. తమ వ్యాక్సిన్‌తో చాలా అరుదుగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే టీకాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. కోర్టుల్లో అనుకూల తీర్పు కోసమే ఆస్ట్రాజెనెకా తమ టీకాను వెనక్కి తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సేమ్‌టైమ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో అరుదైన వ్యాధులు వస్తున్నాయని..ప్రచారం జరగడంతో టీకా వేసుకునేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. అందుకే టీకాను వాపస్ తీసుకుంది ఆస్ట్రాజెనెకా. భవిష్యత్‌లో కోవిషీల్డ్‌పై న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకునేందుకు ఈ ఏడాది మార్చిలో 5న దరఖాస్తు చేసుకుంది ఆస్ట్రాజెనెకా. మే 7న వ్యాక్సిన్‌ ఉపసంహరించుకునేందుకు అనుమతి లభించింది. ఈవ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్రాజెనెకా..త్వరలోనే కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా టీకాలను డెవలప్ చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!

ట్రెండింగ్ వార్తలు