World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!

World Health Day : ప్రీడయాబెటిస్ అనేది వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్‌ స్థాయిల కన్నా తక్కువగా ఉంటాయి. మధుమేహం నిర్ధారణ కోసం పరీక్షలు చేయించుకోవాలి.

World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!

World Health Day: Don't leave prediabetes unchecked, say doctors

World Health Day : భారత్‌లో ఇప్పుడు మధుమేహంతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గత ఏడాదిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియా డయాబెటిస్ (ICMR-INDIAB) అధ్యయనం ప్రకారం.. కనీసం 136 మిలియన్ల మందికి (జనాభాలో 15.3శాతం) ప్రీడయాబెటిస్ ఉంది. 315 మిలియన్లకు పైగా ప్రజలు అధిక రక్తపోటు కలిగి ఉన్నారు. ప్రీడయాబెటిస్ అనేది ఒక వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా పెంచుతుంది.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

5.7 కన్నా ఎక్కువ లేదా 6.3 కన్నా తక్కువ ఉన్నా :
ఈ స్థాయిలను అధిగమిస్తే డయాబెటిస్‌గా మారుతుంది. కానీ, మధుమేహ నిర్ధారణ కోసం థ్రెషోల్డ్ కన్నా తక్కువగా ఉంటాయి. మీ పాస్టింగ్ బ్లడ్ చక్కెర స్థాయిలను చెక్ చేయండి. 100mg/dL నుంచి 125mg/dL మధ్య ఉంటే.. మీరు ప్రీడయాబెటిస్ కేటగిరీ కిందకు వస్తారు. మీరు గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ కూడా చెక్ చేయవచ్చు. మూడు నెలలకు సగటు చక్కెర, 5.7 కన్నా ఎక్కువ అయితే.. 6.3 కన్నా తక్కువ ఉంటే.. అది ప్రీ-డయాబెటిస్ అని కూడా పిలుస్తారు.

ప్రీ-డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం మూత్రం ద్వారా అదనపు చక్కెరను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఏకకాలంలో నీటిని కోల్పోతుంది. ఈ ప్రక్రియ తేలికపాటి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ప్రభావిత వ్యక్తులలో మరింత దాహాన్ని పెంచుతుంది. అన్ని సమయాలలో చాలా దాహంతో ఉన్నట్లయితే.. ప్రీ-డయాబెటిస్ సంకేతం కావచ్చు. గురుగ్రామ్‌లోని ఎండోక్రినాలజిస్ట్, హెచ్‌ఓడీ ఫోర్టిస్ సీ-డీఓసీ డైరెక్టర్, ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ అతుల్ లూత్రా మాట్లాడుతూ.. చాలా మంది భావించినట్లుగా ప్రీడయాబెటిస్ ‘మైల్డ్ డయాబెటిస్’ లేదా ‘బోర్డర్‌లైన్ డయాబెటిస్’ కాదన్నారు. నిజానికి ఇదొక ప్రత్యేకమైన క్లినికల్ ఎంటిటీగా పేర్కొన్నారు.

టైప్ 2 డయాబెటిస్ కన్నా ప్రీ-డయాబెటిస్ సంఖ్య ఎక్కువ :
ఇందులో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయి. కానీ, మధుమేహం వచ్చినప్పుడు కన్నా చాలా తక్కువగా ఉంటాయి. భారత్‌లో టైప్ 2 డయాబెటిస్ కన్నా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని జనాభా డేటా వెల్లడించింది. అధిక ఇన్సులిన్ నిరోధకత ఉందని తేలింది. ప్యాంక్రియాస్ షుగర్ లెవల్స్ పెరగకుండా నిరోధించడానికి ఓవర్ టైం పనిచేస్తుందని డాక్టర్ అతుల్ లూత్రా చెప్పారు.

సీనియర్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఆరిఫ్ హుస్సేన్ భట్, ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మాట్లాడుతూ.. ప్రీ-డయాబెటిస్‌ను చెక్ చేయకుండా వదిలేస్తే.. టైప్ 2 డయాబెటిస్‌గా పురోగమిస్తుందన్నారు. తద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రీడయాబెటిస్ నిర్లక్ష్యం చేస్తే.. టైప్ 2 డయాబెటిస్‌గా మారుతుందన్నారు.

షుగర్ వ్యాధితో వచ్చే సమస్యలివే :
అంతేకాదు.. కాలక్రమేణా, ప్రీడయాబెటిస్‌తో సంబంధం ఉన్న అధిక రక్తంలో చక్కెర స్థాయిలు శరీరంలోని అవయవాలు, కణజాలాలను దెబ్బతీస్తాయి. గుండెజబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, నరాల నష్టం, దృష్టి సమస్యలు, రక్తప్రసరణ సమస్యలు వంటి సమస్యలకు దారితీస్తుంది. అలానే వదిలిస్తే.. మరింత ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గర్భధారణ సమయంలో గర్భధారణ మధుమేహం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ ఆరిఫ్ హుస్సేన్ భట్ చెప్పారు.

ప్రీడయాబెటిస్ పెరుగుతూ ఉండవచ్చు. కానీ, దానిని సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు. డాక్టర్ హుస్సేన్ ప్రకారం.. ప్రీడయాబెటిస్‌ను ముందస్తుగా గుర్తించడానికి రెగ్యులర్ చెకప్‌లు చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. మీ దినచర్యలో శారీరక శ్రమతో సహా వ్యాయామం చేస్తుండాలి. చక్కెర పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. కూరగాయలు, మాంసకృత్తుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజూ తగినంత నిద్రపోండి.

Read Also : WhatsApp Chat Lock Feature : వాట్సాప్‌ కొత్త అప్‌డేట్.. త్వరలో లింక్ చేసిన డివైజ్‌ల్లోనూ చాట్ లాక్ ఫీచర్!