Covishield Vaccine : నాడు ప్రాణం నిలబెట్టింది.. ఇప్పుడు ప్రాణాలు తీస్తుంది.. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో అరుదైన వ్యాధులు!

2021లో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ వేసుకున్నాక.. రక్తం గడ్డకట్టి తన మెదడుకు శాశ్వతంగా గాయమైందని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే ఇన్నాళ్లు ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది.

Covishield Vaccine : కరోనా యావత్‌ ప్రపంచాన్ని  వణికించింది. ఆ మాయదారి రోగం నుంచి జనాల్ని కాపాడేందుకు వివిధ దేశాలు పోటీపడి మరీ వ్యాక్సిన్‌ తీసుకొచ్చాయి. బాడీలో ఇమ్యూనిటీ పెంచి కరోనా రాకుండా చేసిన టీకాలతో.. ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అప్పట్లోనే ప్రచారం జరిగింది. టీకా వేసుకున్నప్పుడు చిన్నచిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావడం కామన్ అని ఎక్స్ పర్ట్స్ కూడా చెప్పారు. కానీ టీకాను తయారుచేసిన సంస్థ మాత్రం.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు వాస్తవాన్ని అంగీకరించింది.

Read Also : Stress Physical Health : ఒత్తిడితో హైబీపీ, అజీర్ణం సమస్యలు.. మీ శారీరక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందంటే?

బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా.. తాము తయారు చేసిన కరోనా వైరస్ టీకా కోవిషీల్డ్‌తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని అంగీకరించింది. కోవిషీల్డ్ వేసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటివి వస్తున్నాయని కోర్టుకు తెలిపింది. ఆస్ట్రాజెనెకా టీకాతో పలు వ్యాధులు వస్తున్నాయనీ, కొన్ని సార్లు మరణానికి దారితీస్తోందనీ బ్రిటన్ కోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. 51 కేసులు విచారణలో ఉండగా.. బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు.

2021లో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ వేసుకున్నాక.. రక్తం గడ్డకట్టి తన మెదడుకు శాశ్వతంగా గాయమైందని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే ఇన్నాళ్లు ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్‌లో కోవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌కు కారణం అవుతుందని అంగీకరించింది. అంటే రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్‌ తగ్గిపోతున్నాయని తెలిపింది.

కరోనా సమయంలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కలసి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను.. పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ టీకాను దేశంలో విస్తృతంగా ఉపయోగించారు. ఇక మనదేశంలో కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్‌పై ఎక్స్ పర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు పిటిషనర్లు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చనిపోయిన, వైకల్యం చెందిన కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్ ఉన్నట్లు ఆస్ట్రాజెనెకా ఒప్పుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!

ట్రెండింగ్ వార్తలు