Hormonal Acne : ఆడవారిలో మొటిమల సమస్య ఎందుకు వస్తుంది? సమస్య నుండి సులభంగా బయటపడటమెలా?

అయితే కొందరికి చాలా త్వరగా మొటిమలు తగ్గిపోతాయి. కొందరిలో మాత్రం మొటిమలు వచ్చాయంటే అంత త్వరగా తగ్గకపోను తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

Hormonal Acne : యుక్తవయస్సు ప్రారంభం నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడవారిలో మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. మహిళల సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. మగ వారిలో కూడా ఈ సమస్య కనిపించినా వారు పెద్దగా దీనిని పట్టించుకోరు. పింపుల్స్‌ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ వస్తాయి. ముఖంపైనేకాకుండా చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. మొటిమలు వచ్చి తగ్గిపోయిన తరువాత కొందరికి ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. మరికొందరికి గుంటలు, గుంటలుగా పడతాయి. అవి తగ్గేందుకు చాలా సమయం తీసుకుంటుంది. వీటి వల్ల మొఖాన్ని ఎదుటివారికి చూపించలేని పరిస్ధితి ఉంటుంది.

మొటిమలు రావటానికి దారి తీసే పరిస్ధితులు ;

హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా మొటిమలు వస్తాయి. అంతే కాకుండా చర్మంలో నూనె గ్రంథుల పనితీరులో తేడా ఉన్నప్పుడు మొటిమల సమస్య ఉంటుంది. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి కూడా ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఒత్తిడితో కూడుకున్న జీవనశైలి సైతం కొన్నిసార్లు మొటిమల సమస్యకు కారణమౌతుంది. పీసీఓడీ సమస్య, కొన్నిరకాల ఉత్ప్రేరకాలు, గర్భనిరోధక మాత్రలు, ఆహారపు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం, కాలుష్యం తదితర కారణాల వల్ల మొటిమల సమస్య వేధిస్తుంది.

అయితే కొందరికి చాలా త్వరగా మొటిమలు తగ్గిపోతాయి. కొందరిలో మాత్రం మొటిమలు వచ్చాయంటే అంత త్వరగా తగ్గకపోను తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వీటిని పోగొట్టుకోవటానికి మార్కెట్లో లభించే రకరకాల క్రీములను వాడుకుంటున్నప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండదు. అయితే మొటిమల సమస్య నుండి బయటపడేందుకు సహజ సిద్ధమైన ఇంటి చిట్కాలు కొన్ని సార్లు బాగా ఉపకరిస్తాయి. మొటిమల సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. తక్కువ ఖర్చుతో మొటిమల సమస్య నుండి విముక్తి ప్రసాదించే చిట్కాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొటిమల సమస్యకు గృహ చిట్కాలు ;

1. ఒక అలోవెరా జెల్‌, కీరదోసకాయ, గుప్పెడు వేపాకులను కూడా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుని ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి కలిపి ముఖం మొత్తానికి అప్లై చేసుకోవాలి. నైట్ నిద్రించే ముందు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. రోజు ఇలా చేస్తే మొటిమలు క్రమంగా తగ్గుతాయి. మచ్చలు సైతం దూరం అవుతాయి.

2. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి.

3. ఒక టీస్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకుని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత వేడినీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి ఒక వారం రోజులపాటు వేసుకుంటే మొటిమల సమస్య వదిలిపోతుంది.

4. కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు సైతం తొలగిపోతాయి.

5. కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి.

6. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి.

7. పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.

8. ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.

ట్రెండింగ్ వార్తలు