Samantha: సమంత ఆరోగ్యంపై స్పందించిన అక్కినేని హీరో.. వైరల్ అవుతున్నా కామెంట్స్!

టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమేనంటూ సామ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన పోస్ట్ అభిమానులతో పాటు సెలెబ్రెటీస్ ని కూడా కలవరపరిచింది. అయితే అందరి దృష్టి మాత్రం అక్కినేని కుటుంబం పైనే ఉంది. తాజాగా ఈ విషయంపై అక్కినేని హీరో అఖిల్..

Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ వార్తలు వస్తున్నా.. వాటిలో నిజం లేదంటూ సమంత మరియు ఆమె సన్నిహితులు ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ సామ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన పోస్ట్ అభిమానులతో పాటు సెలెబ్రెటీస్ ని కూడా కలవరపరిచింది.

Samantha: సమంత త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం!

‘మయోసిటిస్’ అనే వ్యాధి సోకినట్లు, అందుకు చికిత్స పొందుతున్నట్లు సమంత ప్రకటించడంతో.. కియారా అద్వానీ నుంచి ఎన్టీఆర్ వరకు అందరూ ఆమెకు దైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందరి దృష్టి మాత్రం అక్కినేని కుటుంబం పైనే ఉంది. గత ఏడాది సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. కాగా దీనిపై చైతన్య స్పందిస్తాడా లేదా అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై అక్కినేని హీరో అఖిల్ రియాక్ట్ అయ్యాడు. “అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్ని చేకూరుస్తాయి డియర్ సామ్” అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. చైతన్య కూడా స్పందించాలి అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి చూడాలి నాగచైతన్య రియాక్ట్ అవుతాడో లేదో.

ట్రెండింగ్ వార్తలు