Balakrishna : అన్‌స్టాపబుల్.. ఇక్కడ పెళ్లిళ్లు చేయబడును..

ఇక అడివి శేష్ ని నానికి కాల్ చేయమనగా నాని షూటింగ్ లో ఉన్నాడు అనడంతో శేష్ వాళ్ళ అమ్మకి కాల్ చేయమన్నాడు బాలయ్య బాబు. దీంతో అడివి శేష్ వాళ్ళ అమ్మకి కాల్ చేశాడు. వాళ్ళ అమ్మతో బాలయ్య బాబు మాట్లాడాడు. పెళ్లి గురించి టాపిక్ రాగా.........................

Balakrishna :  బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగింది. షోలో భాగంగా బాలయ్య ఆటలు ఆడిస్తాడని తెలిసిందే. అలాగే ఎవరికన్నా కాల్ చేసి మాట్లాడిస్తాడు బాలయ్యబాబు. ప్రతి ఎపిసోడ్ లోను వచ్చిన వాళ్ళతో ఎవరికో ఒకరికి కాల్ చేపించి సరదాగా మాట్లాడిస్తాడు. ఈ ఎపిసోడ్ లో మొదట శర్వానంద్ రానాకి కాల్ చేశాడు. రానా, శర్వానంద్ ఇద్దరూ చిన్నపట్నుంచి ఫ్రెండ్స్ కావడంతో సరదాగా మాట్లాడారు. బాలయ్య కూడా రానాతో మాట్లాడితే శర్వానంద్ తో జాగ్రత్త సర్, చూడటానికి చాలా సైలెంట్ గా ఉంటాడు కానీ యమా డేంజర్ అంటూ సరదాగా చెప్పాడు.

ఇక అడివి శేష్ ని నానికి కాల్ చేయమనగా నాని షూటింగ్ లో ఉన్నాడు అనడంతో శేష్ వాళ్ళ అమ్మకి కాల్ చేయమన్నాడు బాలయ్య బాబు. దీంతో అడివి శేష్ వాళ్ళ అమ్మకి కాల్ చేశాడు. వాళ్ళ అమ్మతో బాలయ్య బాబు మాట్లాడాడు. పెళ్లి గురించి టాపిక్ రాగా మీలాంటి వాళ్ళు చూస్తే చేసేస్తాం సర్ అని శేష్ వాళ్ళ అమ్మ అంది. డైలీ ఇంట్లో పెళ్లి గురించి గొడవే అని చెప్పింది. దీంతో కచ్చితంగా చేసేద్దాం, నేను చేస్తా శేష్ పెళ్లి అని సరదాగా అన్నారు.

Sharwanand : సాయి పల్లవితో గుడికి వెళదామంటే చాలు వచ్చేస్తుంది.. ఇద్దరం కలిసి చాలా గుళ్ళకి వెళ్ళాం..

గత ఎపిసోడ్ లో కూడా సిద్ధూ జొన్నలగడ్డ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ మీ అబ్బాయికి పెళ్లి చేస్తా అన్నారు బాలయ్య. ఈ ఎపిసోడ్ లో కూడా శేష్ కి పెళ్లి చేస్తా అని వాళ్ళ అమ్మతో అన్నారు. అలాగే శర్వాకి కూడా ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి.. అన్‌స్టాపబుల్.. ఇక్కడ పెళ్లిళ్లు చేయబడును.. అని సరదాగా ఈ యువ హీరోలందరిని ఉద్దేశించి అన్నారు. దీంతో ఈ క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు