Bigg Boss 7 Day 8 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? ప్రశాంత్ కి కౌంటర్ల మీద కౌంటర్లు..

నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వగా ఈ సారి బిగ్‌బాస్ కొంచెం డిఫరెంట్ గా చేయించాడు నామినేషన్స్.

Bigg Boss 7 Day 8 Nominations Day contestants fires on Prashanth

Bigg Boss 7 Day 8 : బిగ్‌బాస్ మొదటి వారం పూర్తయింది. ఇక రెండో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్ కి ముందు సందీప్ కి ఇచ్చిన VIP రూమ్ లోకి అందరూ వచ్చారు. ఆ రూమ్ చూస్తామంటూ వచ్చి కొంతమంది అక్కడే పడుకున్నారు. రతిక ఇక్కడ ఎలా ఉంటారు అడగమని సందీప్ ని రెచ్చగొట్టింది. అనంతరం నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వగా ఈ సారి బిగ్‌బాస్ కొంచెం డిఫరెంట్ గా చేయించాడు నామినేషన్స్.

ప్రతి సారి ఒకరు వచ్చి ఎవరెవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పేవాళ్ళు. కానీ ఈ సారి ఒకరు వచ్చి నిలబడితే వాళ్ళని ఎవరెవరు నామినేట్ చేయాలి అనుకుంటున్నారో చెప్పాలి. అలా ఒక బాక్స్ గీసి అందులో ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని నిలబెట్టారు. మిగిలిన వాళ్లలో అతన్ని ఎవరెవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. నామినేట్ చేయగానే బాక్స్ లో నిల్చున్న వారి మీద కలర్ వాటర్ పడతాయి.

మొదట సందీప్ కి మాత్రం పవర్ అస్త్ర గెలుచుకున్నందుకు స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. అతను ఒకర్ని డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు అని చెప్పగా ప్రిన్స్ ని నామినేట్ చేశాడు. దీంతో ప్రిన్స్ – సందీప్ మధ్య కాసేపు గొడవ జరిగింది. ఇక ప్రిన్స్ ని ఇంకెవరూ నామినేట్ చేయకూడదు అని బిగ్‌బాస్ చెప్పాడు.

తేజ వచ్చి నిల్చోగా.. అతన్ని శుభశ్రీ, ప్రశాంత్, రతిక నామినేట్ చేశారు.
ఆ తర్వాత బాక్స్ లోకి దామిని రాగా.. ఆమెని ఎవరూ నామినేట్ చేయలేదు. దీంతో దామిని హ్యాపీ అయింది.
ఆ తర్వాత శివాజీ రాగా.. అతన్ని అమర్ దీప్, ప్రియాంక జైన్, షకీలా, శోభాశెట్టి, దామిని.. ఏకంగా అయిదుగురు నామినేట్ చేశారు.
ఆ తర్వాత ప్రశాంత్ ని.. గౌతమ్, అమర్ దీప్, షకీలా, తేజ, దామిని, ప్రియాంక.. ఏకంగా ఆరుగురు నామినేట్ చేశారు. దీంతో ప్రశాంత్ అందరితో గొడవ పెట్టుకున్నాడు. ఇక బయట ప్రశాంత్ కి ఫుయిల్ నెగిటివిటి ఉన్న సంగతి తెలిసిందే. రైతు బిడ్డ అని చెప్పుకుంటూ అతను ఎదగడానికి రైతుల పేరు వాడుకొని మోసం చేస్తున్నాడని కామెంట్స్ ఎప్పట్నుంచో వస్తున్నాయి, అలాగే బిగ్‌బాస్ కి అడుక్కొని వచ్చాడని అందరూ అంటూనే ఉన్నారు. ఇవే కామెంట్స్ హౌస్ లో వాళ్ళు కూడా అనడంతో ప్రశాంత్ కి ఏం చేయాలో తెలియలేదు. సెంటిమెంట్ తో నటిస్తున్నాడని అందరూ ఫైర్ అయ్యారు ప్రశాంత్ మీద. ఇన్ని రోజులు రతికతో పులిహార కలుపుతూ కూర్చోగా ఇప్పుడు రతిక కూడా ప్రశాంత్ కి కౌంటర్లు వేయడంతో షాక్ అయ్యాడు.

Bigg Boss 7 Day 7 : ఊహించినట్టు తనే మొదటి ఎలిమినేషన్.. సండే హైలెట్స్..

ఇలా సోమవారం నాడు సగం కంటెస్టెంట్స్ నామినేషన్స్ అవ్వగా మిగిలినవి మంగళవారం నాడు చూపించనున్నాడు బిగ్‌బాస్.

ట్రెండింగ్ వార్తలు