BiggBoss 6 Day 69 : శనివారమే ఎలిమినేషన్.. ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్న బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్ అందరికి క్లాస్ పీకిన నాగార్జున..

ఈ సారి బిగ్‌బాస్ లో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆదివారం మాత్రమే ఎలిమినేషన్ ఉండేది. కానీ ఈ సీజన్ లో శనివారమే ఎలిమినేషన్ ఇచ్చేస్తున్నారు. ఆదివారం ఇంకో ఎలిమినేషన్.............

BiggBoss 6 Day 69 :  ఈ సారి బిగ్‌బాస్ లో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆదివారం మాత్రమే ఎలిమినేషన్ ఉండేది. కానీ ఈ సీజన్ లో శనివారమే ఎలిమినేషన్ ఇచ్చేస్తున్నారు. ఆదివారం ఇంకో ఎలిమినేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేలా చేస్తున్నారు. శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో ఎప్పటిలాగే నాగార్జున కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యాడు.

ముఖ్యంగా రేవంత్, ఇనయాలపై సీరియస్ అయ్యాడు నాగార్జున. కెప్టెన్సీ టాస్క్ లో రేవంత్ మీద అందరికి కంప్లైంట్స్ ఉన్నాయి. బిగ్‌బాస్ పెట్టిన రూల్స్ కి వ్యతిరేకంగా రేవంత్ ప్రవర్తించాడు, నువ్వు కోపం తగ్గించుకోమని ఎన్ని సార్లు చెప్పినా మారట్లేదు అని సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత ఇనయా ఇటీవల ఏది పడితే అది మాట్లాడేస్తుంది, మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఫైమాకి ఇనయా చేత సారీ చెప్పించాడు.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి డాక్టర్ పేషేంట్ అనే గేమ్ ఇచ్చాడు. డాక్టర్ లాగా మెడలో స్టెతస్కోప్ వేసుకొని అక్కడున్న ట్యాగ్స్ లో ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక ట్యాగ్ ఇవ్వాలి అందరూ. అలాగే దానికి విరుగుడుగా అక్కడ ఉన్న కొన్ని డ్రింక్స్ ఇవ్వాలి. శ్రీసత్య.. రేవంత్‌కు మొండితనం ఇచ్చింది. ఇనయ.. వాసంతికి ఇమ్మెచ్యురిటీ, రాజ్‌.. ఇనయకి వితండవాదం, ఫైమా.. ఇనయకు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌, మెరీనా.. వాసంతికి నమ్మకద్రోహం, ఆదిరెడ్డి.. ఇనయాకి ఇగో, రేవంత్.. శ్రీసత్యకు కక్కుర్తి, రోహిత్.. ఇనయకు తలపొగరు, కీర్తి.. శ్రీసత్యకు ఇగో, బాలాదిత్య.. ఫైమాకు స్వార్థమెక్కువ, శ్రీహన్.. రేవంత్‌కు స్వార్థమెక్కువ, వాసంతి.. శ్రీసత్య మానిప్యులేటర్‌ అని ట్యాగ్స్ ఇచ్చారు. ఈ ట్యాగ్స్ ఇస్తూ కారణాలు కూడా చెప్పారు కంటెస్టెంట్స్.

ఈ టాస్క్ తర్వాత సడెన్ గా బాలాదిత్య ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అయ్యారు. నామినేషన్స్ వాళ్ళందరిని ముందుకి రమ్మన్నారు నాగ్. అయితే శనివారం ఎలిమినేషన్ ఉండదు కదా అని అనుకున్నారు కానీ నాగ్ అందరికి ట్విస్ట్ ఇచ్చి బాలాదిత్య ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పాడు. అలాగే ఆదివారం ఇంకో ఎలిమినేషన్ కూడా ఉంటుందని చెప్పాడు నాగ్. దీంతో కంటెస్టెంట్స్ మరోసారి షాక్ అయ్యారు.

BiggBoss 6 Day 68 : కొత్త కెప్టెన్ ఫైమా.. జైల్లోకి ఇనయా..

ఇక బాలాదిత్య స్టేజిపైకి వచ్చి కంటెస్టెంట్స్ కి ఒక్కొక్కరికి సలహాలిచ్చారు. ఆదిరెడ్డిని గట్టిగా అరవకుండా కాన్ఫిడెంట్‌గా మాట్లాడు అని చెప్పాడు. ఫైమాకి గేమ్స్ స్ట్రాటజీలు ఫెయిరా? అన్‌ఫెయిరా? చూసుకొని ఆడమని అన్నాడు. రాజ్‌ ఏదైనా క్లారిటీగా చెప్పాలన్నాడు. రోహిత్‌ను టెంపర్‌ లూజవ్వద్దని, మెరీనాని ఇండిపెండెంట్‌గా ఆడమని, శ్రీసత్యని కోపంలో జాగ్రత్తగా మాట్లాడమని, శ్రీహాన్‌ తెలివైనవాడని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని, రేవంత్ కోపం తగ్గించుకోవాలని, ఇనయకు మాట్లాడటం సరిగా రాదు అని, కీర్తిని ఎక్కువ ఆలోచించొద్దని, వాసంతిని గేమ్‌ మీద ఫోకస్ చేయమని సలహాలిచ్చారు. మరి నేటి ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు