Jailer 2: ‘జైలర్‌-2’ కోసం అడ్వాన్స్ అందుకున్న ద‌ర్శ‌కుడు నెల్సన్‌ దిలీప్ కుమార్..! ఎంతో తెలుసా..?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) న‌టించిన చిత్రం జైల‌ర్ (Jailer). నెల్స‌న్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది

Nelson Dilipkumar receiving huge remuneration

Jailer 2 Movie : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) న‌టించిన చిత్రం జైల‌ర్ (Jailer). నెల్స‌న్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. గ‌త‌ కొన్నాళ్లుగా స‌రైన హిట్ లేక అల్లాడిపోతున్న త‌లైవాకు మంచి క‌మ్ బ్యాక్‌గా నిలిచింది. ఆగ‌స్టు 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా రూ.700 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర‌బృందం వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

అయితే.. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం నెల్స‌న్ దిలీప్ కుమార్ జైల‌ర్-2 చిత్రానికి స్ర్కిప్ట్‌ను రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ని అంటున్నారు. ఈ చిత్రం కోసం నెల్స‌న్‌కు నిర్మాత క‌ళానిధి మార‌న్ క‌ళ్లు చెదిరే మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ఇచ్చార‌నే టాక్ న‌డుస్తోంది. రూ.55 కోట్ల చెక్‌ను ఆయ‌న‌కు అందించారని ఆ వార్త సారాంశం. ఈ చిత్రాన్ని కూడా స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పైనే రూపొందించ‌నున్నారు. జైల‌ర్ సినిమాకి సంగీతాన్ని అందించిన అనిరుద్ ఈ చిత్రానికి కూడా స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్నాడు.

Yash19 : హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌తో యశ్‌.. త్వరలో గుడ్ న్యూస్.. పిక్ వైరల్..

ఇదిలా ఉంటే.. ర‌జినీకాంత్ ప్ర‌స్తుతం టీజే జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. త‌లైవా 170 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి కూడా అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో పాటు లోకేశ్ క‌న‌గ‌రాజ్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో మ‌రో చిత్రంలో కూడా ర‌జినీకాంత్ న‌టించ‌నున్నారు.

ట్రెండింగ్ వార్తలు