Just A Minute Review : ‘జస్ట్ ఎ మినిట్’ మూవీ రివ్యూ.. బోల్డ్ కామెడీ..

 ఏడు చేపల కథ సినిమా హీరో అభిషేక్ పచ్చిపాల మరో బోల్డ్ కామెడీ 'జస్ట్ ఎ మినిట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Abhishek Pachipala Just A Minute Movie Review and Rating

Just A Minute Review : ఏడు చేపల కథ సినిమా హీరో అభిషేక్ పచ్చిపాల మరో బోల్డ్ కామెడీ ‘జస్ట్ ఎ మినిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిషేక్ హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా, రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్ బ్యానర్ పై కార్తీక్ ధర్మపురి, తన్వీర్, ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా యశ్వంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జస్ట్ ఎ మినిట్. ఈ సినిమా జులై 19న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. ఓ పర్సనల్ ఆరోగ్య సమస్యతో రవి (అభిషేక్ పచ్చిపాల) బాధపడుతుంటాడు. ఆ సమస్య గురించి ఎవ్వరికి చెప్పుకోలేడు. తన ఫ్రెండ్ రాంబాబు(జబర్దస్త్ ఫణి)కి మాత్రమే తెలుసు. కానీ తనకున్న సమస్యతో రవి మరిన్ని సమస్యలు తెచ్చుకుంటాడు. దీంతో ఎలాగైనా తన సమస్య తీర్చుకోవాలని రవి తన ఫ్రెండ్ రాంబాబుతో కలిసి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో రవికి పూజ(నజియా ఖాన్) పరిచయం అవ్వడంతో ఆమెతో ప్రేమలో పడతాడు. అసలు రవికి ఉన్న సమస్య ఏంటి? రవి సమస్య పూజకు తెలుస్తుందా? పూజతో ప్రేమ ఏమైంది? రవి సమస్యకు పరిష్కారం దొరికిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Mahesh Babu : సితార పాప బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ విషెస్ చెప్పిన మహేశ్, నమ్రతా

సినిమా విశ్లేషణ.. గతంలోనే అభిషేక్ బోల్డ్ కామెడీతో పలు సినిమాలతో మెప్పించాడు. మరోసారి తనకి బాగా అచ్చొచ్చిన జానర్ బోల్డ్ కామెడీతోనే జస్ట్ ఎ మినిట్ అంటూ వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా రవికి ఉన్న సమస్యతో వచ్చే సమస్యలు, రవి, రాంబాబు కలిసి చేసే కామెడీ ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో తన ప్రేమ, ఓ పక్క తన ప్రేమ సమస్య, మరో పక్క తన సమస్యతో రవి ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు, పూజతో ప్రేమ ఏమైంది అని సాగుతుంది. ఫుల్ లెంగ్త్ కామెడీగా సాగిన చివర్లో ఎమోషన్ తో మెప్పించారు. కామెడీ వర్కౌట్ అయినా కొన్ని సీన్స్ మాత్రం ల్యాగ్ అనిపిస్తాయి. కాకపోతే సినిమా నిడివి తక్కువ కావడంతో తొందరగానే అయిపోయింది అనిపిస్తుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్.. అభిషేక్ పచ్చిపాల తన సమస్యని కామెడీగా చూపిస్తూ ప్రేక్షకులకు నవ్వు తెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ నజియా ఖాన్ గ్లామర్ వరకు మాత్రమే పరిమితమైంది. జబర్దస్త్ ఫణి తన కామెడీతో నవ్వించాడు. సారిపల్లి సతీష్, కార్తీక్ ధర్మపురి, వినీషా.. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపించాయి.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. కొన్ని బోల్డ్ డైలాగ్స్ బాగా పేలాయి. కథ, కథనం రెండు కొత్తగానే ఉన్నాయి. మొదటి సినిమాతో యశ్వంత్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. పాటలు పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చిన్న సినిమా అయినా నిర్మాతలు కావాల్సినంత ఖర్చుపెట్టి మంచి అవుట్ పుట్ తీసుకొచ్చారు.

మొత్తంగా ‘జస్ట్ ఎ మినిట్’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు