RGV : ఇండైరెక్ట్ గా పైరసీకి సపోర్ట్ చేసిన ఆర్జీవీ.. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి నిర్మాతలకు కౌంటర్..
(RGV)శివ రీ రిలీజ్ ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పైరసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు ఆర్జీవీ.

RGV
RGV : సెన్సేషనల్ దర్శకుడు ఆర్జీవీ ఏం మాట్లాడినా, ఏం ట్వీట్ చేసినా కఠినంగా అనిపించినా అవే నిజాలు అని ఒప్పుకోక తప్పదు కొన్నిసార్లు. ఒకప్పుడు తన సినిమాలతో వైరల్ అయిన ఆర్జీవీ ఇప్పుడు తన ట్వీట్స్ తో, ఇంటర్వ్యూలలో మాటలతో వైరల్ అవుతున్నాడు. తాజాగా శివ రీ రిలీజ్ త్వరలో ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పైరసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు ఆర్జీవీ.(RGV)
ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను కొంత బజ్ ఉన్న సినిమాలు అన్ని చూస్తాను. వాటిల్లో కొన్ని థియేటర్స్ లో చూస్తే కొన్ని సార్లు పైరసీలో కూడా చూస్తాను. పైరసీని ఆపడం ఎవరితరం కాదు. ప్రేక్షకుడి సైకాలజీ ఎలా ఉంటుందంటే నాకు మంచి సినిమా తక్కువరేటుకు తక్కువ టైంలో కావాలని ఆశిస్తాడు. అందుకు సంబంధించిన టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు ప్రేక్షకుడిని పైరసీ చూడకుండా ఎవరూ ఆపలేరు. మేకర్స్ మాత్రం ఇంకా డబ్బులు కావాలి అంటారు. మళ్ళీ వాళ్ళే పైరసీ ఆపాలంటారు. టెక్నాలజీ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఒకరికి లాభం చేసే టైం లో ఇంకొకరికి నష్టం తప్పదు అని అన్నారు.
Also See : Mega 157 Title Launch event : చిరంజీవి – అనిల్ రావిపూడి టైటిల్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
దీంతో టెక్నాలజీని, పైరసీని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూనే టికెట్ రేట్లు పెంచేసి నిర్మాతలు డబ్బుల కోసం ఆశపడుతున్నారని ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు ఆర్జీవీ. ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.