Chiranjeevi : ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో.. ఏడ్చేసిన చిరంజీవి.. ఇంతకీ అది ఏ సినిమా..?

సూపర్ హిట్ అవుతుందన్న సినిమా, అంచనాలు ఉన్న సినిమా ఫ్లాప్ అవ్వడంతో చిరంజీవి ఏడ్చాడట. అందులోనూ తన సినిమానే కావడం గమనార్హం. (Chiranjeevi)

Chiranjeevi : ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో.. ఏడ్చేసిన చిరంజీవి.. ఇంతకీ అది ఏ సినిమా..?

Chiranjeevi

Updated On : August 24, 2025 / 8:23 AM IST

Chiranjeevi : సాధారణంగా సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు ఎవరైనా సినిమాలు కష్టపడి తీస్తే తర్వాత ఫలితం మాత్రం ప్రేక్షకులకు వదిలేస్తారు. హిట్ అయితే సంబరాలు చేసుకుంటారు. ఫ్లాప్ అయితే కొన్ని రోజులు సైలెంట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సినిమా చూసుకుంటారు. కొంతమంది మాత్రం సినిమా హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా కష్టపడుతూ వెళ్ళిపోతారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.(Chiranjeevi)

అయితే చిరంజీవి కూడా ఓ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని ఏడ్చాడట. అందులోనూ తన సినిమానే కావడం గమనార్హం. సూపర్ హిట్ అవుతుందన్న సినిమా, అంచనాలు ఉన్న సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఏడ్చాడట.

Also Read : RGV : ఇండైరెక్ట్ గా పైరసీకి సపోర్ట్ చేసిన ఆర్జీవీ.. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి నిర్మాతలకు కౌంటర్..

గతంలో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వేట అనే సినిమా ఫ్లాప్ అవ్వడంతో నేను బాగా ఏడ్చాను. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఇంట్లో దుప్పటి కప్పుకొని మరీ ఏడ్చాను. ఖైదీ లాంటి సక్సెస్ తర్వాత అదే డైరెక్టర్, నిర్మాతలతో సినిమా కావడంతో వేట సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా కోసం నేను కూడా చాలా కష్టపడ్డాను కానీ అది ఫ్లాప్ అవ్వడంతో బాధపడ్డాను అని తెలిపారు.

చిరంజీవి, జయప్రద, సుమలత, జగ్గయ్య మెయిన్ లీడ్స్ లో బ్రిటిష్ కాలంలోని లవ్ స్టోరీ, సస్పెన్స్ రివెంజ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. 1986 మేలో రిలీజయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడ్డాడు. ఇందులో చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి.

Also Read : Tamannaah Bhatia : సన్నీలియోన్ ప్లేస్ లో ‘తమన్నా’.. అడల్ట్ హారర్ సినిమాలో మరోసారి రెచ్చిపోనున్న మిల్కీ బ్యూటీ..

అలాగే.. శంకరాభరణం సినిమా చూసి ఏడ్చానని, తన విజేత సినిమా క్లైమాక్స్ చూసి ఏడ్చానని తను ఎమోషనల్ అయిన సినిమాల గురించి కూడా తెలిపారు చిరంజీవి. ఇటీవలే చిరంజీవి 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. విశ్వంభర సినిమా, మన శంకర వరప్రసాద్ గారు, బాబీ దర్శకత్వంలో, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్.