JioTag Air Launch : భారత్‌లో జియోట్యాగ్ ఎయిర్ ఇదిగో.. ప్రారంభ ధర రూ. 1,499 మాత్రమే..!

JioTag Air Launch : జియోట్యాగ్ ఎయిర్ ముఖ్య ఫీచర్లలో ఆపిల్ ఫైండ్ మై యాప్ ద్వారా ట్యాగ్ చేసిన అంశాలను ఇతర ఆపిల్ యూజర్లతో షేర్ చేయొచ్చు. ఈ డివైజ్ 90-120dB వరకు భారీ సౌండ్ కూడా రిలీజ్ చేస్తుంది.

JioTag Air now available in India ( Image Source : Google )

JioTag Air Launch : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవల భారతీయ యూజర్ల కోసం జియోట్యాగ్ ఎయిర్ అనే కొత్త అసెట్ ట్రాకర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త డివైజ్ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 1,499 ధరతో అందబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ జియోట్యాగ్ ఎయిర్ సొంతం చేసుకోవచ్చు. జియోట్యాగ్ ఎయిర్ అనేది ఆపిల్ ఎయిర్‌ట్యాగ్‌కు పోటీగా మార్కెట్లోకి వచ్చింది. ఈ డివైజ్ ధర ప్రస్తుతం రూ. 2,889కు లభ్యమవుతుంది.

Read Also : Mahindra Thar Roxx : మహీంద్రా థార్ రోక్స్ చూశారా? భలే ఉంది భయ్యా.. థార్ 5-డోర్ వెర్షన్‌.. ఫీచర్లు ఇవేనట!

జియోట్యాగ్ ఎయిర్ అనేది ఒక కాంపాక్ట్ డివైజ్. వినియోగదారులు తమ విలువైన వస్తువులైన కీ, ఐడీ కార్డులు, వ్యాలెట్స్, పర్సులు, సామాను, పెంపుడు జంతువులను గుర్తించడంతో పాటు ట్రాక్ చేయడంలో సాయపడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ అంశాలకు జియోట్యాగ్ ఎయిర్ ఫెయిర్ చేయడం ద్వారా వినియోగదారులు వారి లొకేషన్ మానిటరింగ్ చేయగలరు. జియోట్యాగ్ ఎయిర్ ముఖ్య ఫీచర్లలో ఒకటి. రెండు ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లతో అందుబాటులో ఉంది.

ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో జియోథింగ్స్ యాప్ :
ఆపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్, జియోథింగ్స్ యాప్ కూడా అందిస్తుంది. అయితే, వినియోగదారులు ట్రాకింగ్ సామర్థ్యాల కోసం ఒకేసారి ఒక యాప్‌ని ఎంచుకోవాలి. ఆపిల్ యూజర్ల కోసం జియోట్యాగ్ ఎయిర్ ఐఫోన్లు, ఐప్యాడ్స్, మ్యాక్స్ అందుబాటులో ఉండే ఆపిల్ ఫైండ్ మై యాప్‌తో పనిచేస్తుంది. ఆపిల్ ఎకోసిస్టమ్‌ని ఇష్టపడే వారు జియోట్యాగ్ ఎయిర్ ట్రాక్ చేయడం, మేనేజ్ చేయడం ద్వారా జియోథింగ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

జియోట్యాగ్ ఎయిర్ ముఖ్య ఫీచర్లలో ఆపిల్ ఫైండ్ మై యాప్ ద్వారా ట్యాగ్ చేసిన అంశాలను ఇతర ఆపిల్ యూజర్లతో షేర్ చేయొచ్చు. ఈ డివైజ్ 90-120dB వరకు భారీ సౌండ్ కూడా రిలీజ్ చేస్తుంది. సమీపంలోని ట్యాగ్ చేసిన అంశాలను త్వరగా గుర్తించగలదు. వినియోగదారులు తమ విలువైన వస్తువులను మరిచిపోకుండా ఉండేలా ఈ జియోట్యాగ్ సాయపడుతుంది. ఏదైనా వస్తువు పరిధి వెలుపల ఉన్నప్పుడు జియోట్యాగ్ ఎయిర్ డిస్‌కనెక్ట్ వార్నింగ్స్ అందిస్తుంది.

అదనంగా, ఆపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ఆపిల్ ఫోన్లను ఉపయోగించి దూరంగా ఉన్న వస్తువులను గుర్తించడంలో సాయపడుతుంది. నెట్‌వర్క్‌లో పోయిన వస్తువు కనుగొనబడినప్పుడు ఆటోమేటిక్ నోటిఫికేషన్‌లను పొందేలా వినియోగదారులు లాస్ట్ మోడ్‌ని కూడా ఎనేబుల్ చేయొచ్చు. జియోట్యాగ్ ఎయిర్ అదనపు బ్యాటరీ, బాక్స్‌లో లాన్యార్డ్ కేబుల్‌తో వస్తుంది. రీప్లేస్‌మెంట్ అవసరం లేకుండానే రెండు ఏళ్ల వరకు వినియోగాన్ని పొందవచ్చని కంపెనీ పేర్కొంది. గ్రే, బ్లూ, రెడ్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : Infosys Campus Recruitment : ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్లాన్.. 20వేల మంది ఫ్రెషర్లకు త్వరలో ఉద్యోగవకాశాలు..!

ట్రెండింగ్ వార్తలు