Mahindra Thar Roxx : మహీంద్రా థార్ రోక్స్ చూశారా? భలే ఉంది భయ్యా.. థార్ 5-డోర్ వెర్షన్‌.. ఫీచర్లు ఇవేనట!

Mahindra Thar Roxx : మహీంద్రా థార్‌ మాదిరిగానే థార్ రోక్స్‌ కొత్త వెర్షన్ కారును కూడా వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆవిష్కరించనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ టీజర్ ప్రకారం.. రాబోయే థార్ రోక్స్ కొత్త బంపర్ డిజైన్‌ను కలిగి ఉంది.

Mahindra Thar Roxx : మహీంద్రా థార్ రోక్స్ చూశారా? భలే ఉంది భయ్యా.. థార్ 5-డోర్ వెర్షన్‌.. ఫీచర్లు ఇవేనట!

Mahindra Thar Roxx name confirmed, launch ( Image Source : Google )

Mahindra Thar Roxx : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి సరికొత్త థార్ SUV మోడల్ కారు వచ్చేస్తోంది. ఈ కొత్త కారు 5-డోర్ వెర్షన్‌తో రానుంది. దీన్ని థార్ రోక్స్ పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. స్వదేశీ తయారీదారు షేర్ చేసిన కొత్త టీజర్‌లో ఈ కొత్త థార్ రోక్స్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

Read Also : BSNLకు రోజురోజుకు క్రేజ్ ఎందుకు పెరుగుతోంది.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీ ఇవ్వబోతుందా?

మహీంద్రా థార్‌ మాదిరిగానే థార్ రోక్స్‌ కొత్త వెర్షన్ కారును కూడా వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆవిష్కరించనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ టీజర్ ప్రకారం.. రాబోయే థార్ రోక్స్ కొత్త బంపర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ థార్ రోక్స్ పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఉండదు. ఫ్రంట్ సైడ్ కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. రాత్రిపూట ప్రకాశంతంగా వెలుతురును అందిస్తాయి. వీటిలో గ్రిల్ కూడా అమర్చారు.

రెండువైపులా, కొత్త సెట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. థార్ రోక్స్ వీల్‌బేస్ చూసేందుకు 18 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. డైమండ్-కట్ యూనిట్‌గా వస్తాయి. వీల్‌బేస్ చాలా పొడవుగా అందిస్తోంది. ఈ వీల్‌బేస్ ఉండటంతో లోపలికి ఎగ్రెస్‌ ఉండేలా వెనుక డోర్‌లను అమర్చారు. బ్యాక్ సైడ్ ప్రయాణీకులు కూర్చొనేందుకు కూడా ఎక్కువ స్థలం ఉంటుంది. ఈ మోడల్ లో వేరియంట్‌లలో ఆఫర్‌లో స్టీల్ వీల్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ ఒకేలా ఉంటుంది. కానీ, ఎలిమెంట్స్ రివైజ్ చేశారు.

మహీంద్రా థార్ రోక్స్ ఫీచర్లు (అంచనా) :
మహీంద్రా థార్ రోక్స్ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. కొత్త పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్‌తో వస్తుంది. ఆఫర్‌లో బ్యాక్ ఏసీ వెంట్‌లు, రివైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. టీజర్‌లో చూడగలిగే ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. థార్ రోక్స్‌తో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందించాలని మహీంద్రా భావిస్తోంది. థార్ కన్నా మరింత ప్రాక్టికల్ ఎస్‌యూవీ కోరుకునే వారికి ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ కోరుకునే వారికి అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది.

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. థార్ రోక్స్ అద్భుతమైన డిజైన్, ప్రీమియం కోటీన్, అధునాతన సాంకేతికత, మెరుగైన పనితీరు, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీతో కూడిన ది ఎస్‌యూవీ ఫీచర్లను కలిగి ఉంది. దిగ్గజ థార్ ‘థార్ రోక్స్’ రాక్‌స్టార్ ఇతర వేరియంట్లకు పోటీగా మార్కెట్లో నిలువనుంది.

Read Also : Infosys Campus Recruitment : ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్లాన్.. 20వేల మంది ఫ్రెషర్లకు త్వరలో ఉద్యోగవకాశాలు..!